Posts

Showing posts from December, 2021

పెద్దన!!

Image
అల్లికల్జిగిబిగియౌ అల్లసాని వరూధిని, విదుషి, బల్గడసరి!/ ఉల్లమచలమౌ అలేఖ్య తనూవిలాసుడా ప్రవరుడు నిత్యాగ్నిహోత్రి!/ శైలమూర్ధన్యమౌ ఆ హిమాద్రి వర్ణన లపూర్వ రమ్యా క్షర మహద్రాశి/ అలంకారమె,ఆంధ్రకావ్య వాణీ గ్రైవేయమై,అక్కవి  మనుచరితయున్!                           

గోదాదేవి!!

Image
    కల లోన,ఇల లోన, కలవేణు రవమ్ముల వాడె!    ఎలయించి,గికురించి,ఆట పాటలాడేనె,బేలతో!    అల శ్రీరంగ నాథుని,యీ కనులార కాంతునో లేదో    పొలతి! తులసి దామములనైన సందేశ మంపవే!!

తులసి!!

Image
తులసి, గ్రృహాంగణముల సిరికళ పెంచు హరిత  రాశి/ తులసి,దేహారోగ్యమ్ములకు త్రాణమౌ ధన్వంతరీ  సువేషి/ తులసి,మోహాపహ శ్రీ వాసుదేవ విహరణ పుణ్య దేశి/ తులసి,అఘనాశి,గుణ విశేషి,సత్త్వ సుధా కలశి యున్!                                *****

అన్నమయ్య!!

Image
వర హర్యసి,నందకపు అంశయైన అన్నమాచార్య, స్వర పాంచజన్యము భక్తిగ పూరించ,భవ్యాతి భవ్య సరస సాహిత్య సంగీత లహరులై తేలె గీతిక ల్తిరుమల నాథు చరణముల వ్రాల,వర విరులై!!

రాముడొచ్చె!!

Image
                        రాముడొచ్చె!! రాముడొచ్చినాడు రాజు ఇంటికీ, భక్తి రాజు ఇంటికీ భామ సీతతో అనుజు లనుగు హనుమతో, ప్రేమతో మాటమల్లెల పాటల కట్టీ,నీల మోహను మ్రోలను పూటపూటకుంచు,త్యాగరాజునిచూడ,పరబ్రహ్మమౌ రాజారాము డొచ్చె నిదె, వినీతుడై  దాస వసతికీ పూజా ఫలమై, యోగాదుల కందని సగుణ రూపుడై నిధుల, ప్రభు సన్నిధుల కాదన్న వైనపు బలమొ మాధ్వీ ద్రాక్షా ఫణితుల క్రృతి మాలికాతతి చలువో వేద రూపుడిల తా నవతరించి, దేవ కార్యముకై గానమూర్తియౌ పుణ్య శ్లోకు,తీరిక కలియు నెపమొ కరి గావ మకరి  ద్రుంచి,  క్రృష్ణకై వడి పుట్ట మిచ్చి ఆరి నడచ న్రృహరియై,యీతడె!దయాభిరాముడై! తీరుల రామ రామ యను, జ్ఞాన కీరము నరయగ కోరి వచ్చె కోదండరామ నామ, శార్జ్ఞపాణి హరియే.                               *****

యశోదాక్రృష్ణ!!

Image
     తిన్నది లేదు,అన్నన్న పాల్పెరుగులన్ని,మన్నున      పోసెద/      వన్నుల మిన్నలందరు వాపోదు రాగడముల,       అల్లరి కన్న!/      ఎన్నని ఓర్తునని దండించు యశోదతో "ఎన్నన్       కన్నవారీ /      చన్నున పోదురె!యను దేవు,యెల నవ్వులె రక్ష             మాకున్!!                               ********

విరి ఆశ!

Image
                      ఏమనెనె చిన్నారి పొన్నారి ఈ  విరి            ఏమనునె విప్పారిన సుగంధ  సిరి            నిమిషమేదొ పెంధూళి కలియు తరి            ఆ మునుపె శివపదము చేర గురి!!

వైనతేయులు!!

Image
అన్న అనూరుడయ్యు దినేశ రథ సారథి, సమర్ధుడై/ అన్నన్న!నీవేమొ రమేశ తురంగమవు సు  పర్ణుడవై/ కన్న భాగ్యమదేమొ,యీ వినతా సుత ద్వయి విరాజిలె/ యెన్నగ శ్రీమన్నారాయణీయమై,కాశ్యప ప్రభా దీప్తమై!!                              ******

హనుమ!

Image
వేద రూపుని గుర్తించి, మూపున వహించిన జ్ఞాని ఆది దంపతుల పూజించి,గుండెలో నిల్పిన ధ్యాని ఔదల దాల్చి,స్వామి కార్యము పూర్తి జేసిన మౌని గంధవహ ప్రియసుతు హనూమంతు తలతు భక్తిన్!!

ప్రక్రృతి!!

Image
     పువ్వులె, ఎగిరే గువ్వలై తోచెను, చిత్రమె? /     నవ్వులె,తుళ్ళింతలె,పలు వన్నెల చర్చలె!/     గువ్వైన, నవ్వైన, పువ్వైన,నింగి కెగయదె/     అవ్వల గిరు లివ్వల ఝరులున్న సీమన్!!                            *****

ఆయువు!!

పులి తరిమి అలసిపోవు, సుడిగుండములు  కరగి పోవు/ సలసల మంటలు చల్లారు,బిగియు ఉరి ముడి విడివడు/ అలల ఉరవడి పానుపౌ,శిఖరపు టంచులు పూదారులౌ/ ఇలను ఆయువుల నిర్ణేత ఆ దైవము కాదె, భూతపతియై!!

తుహిన హరి!!

బదరీ నారాయణు కంపెనో కూర్మితో నా  కైలాసాధిపతి/   ఆదరమున సోదరుకు కాన్కని తలచెనో  హైమవతి/ సద్యశ నిభ తుహిన మెల్లెడల  పాండురా ఛ్ఛాదకమయ్యె/ భేదమేమి శైత్యాతప హెచ్చు కుందులు,  శుధ్ధసత్త్వునకున్! *****

రక్షకి!!

Image
      అష్ట దళ సుమమున తెఱగుల వెలసె నీ       ఇష్ట కామ్యముల తీర్చెడి శ్రీ శివ కామేశ్వరి,       తుష్టి కూర్చెడి, వికచాబ్జనేత్ర, కరుణాలయ!       శిష్టులెల్లరును భద్రమంద,దుష్టమతుల్కుంద!