Posts

Showing posts from December, 2025

ప్రయత్నం!

Image
ప్రయత్నమే పొద్దుతిరుగుడు విరిబాలకు తెలిసినది వియత్తలపు దేవుని దిశ  కనుక్షణం మరలాలన్నది!

సత్త్వ శిల్పి!

Image
  ఏ కమనీయాకృతులు మెదల నపూర్వతూలిక  పట్టి ఏ కనుల పడని యదృశ్య శక్తియై రంగురూపు  లద్ది ఏ కోమల భావనల ఆ సతత సాత్త్విక శోభా మూర్తి ఈ కమలారుణిమల తీర్చెనో భువి యెవ్వరి  కెరుక?!                               ** ఆ కోటి ధారల హరి కౌశల చక్రమునకు  మౌనిగ సాకల్యప్రపత్తి సాష్టాంగమ్ము చేయుట దొక్కటె కార్యమై!