Posts

Showing posts from May, 2024

హరి సేవలో!

Image
          గరుడ వర్ధనములు విరిసినవి          సిరిపతి పదముల నాశించునవి          పేరున హరి తురగము దాల్చినవి         బిరాన తీర్చరె పూల మనోరథమున్!

పిచ్చుక!

Image
అంతంతటి మేధావుల ఆకాశమంటు విజ్ఞాన శిఖరములు ఇంతింతన రాని ప్రాణి హానికర కిరణ ప్రసరణములు ఎంతకు ధనమె,పొంచిన ప్రమాదము కానని నిర్లక్ష్యములు ఇంతోటి ఆనందజీవిని రూపుమాపిన, నర విక్రృతములు ! ***

కనకాంబర!

Image
అహో కనకాంబర ధారిణి ఆయెనే నేడంబరము మహారాజ్ఞి ఆర్యా మహాదేవి త్రిపురసుందరి మెచ్చ బ్రాహ్మీ వేళల దర్శించి యొచ్చెనో కైలాసాచలమున విహాయసాంగణమెల్ల పాటలారుణముల శోభిలెన్!√

గోరక్ష!!

Image
ఇంటి లోన ఎవ్వరమ్మ అన్నపూర్ణ లిటు చూడరే సుంత  కంట నిండు ఆశల వచ్చినాము గో గోవత్సముల మిప్డు  కంటకములై మము బాధించు తుంటరుల పని పట్టరె వెంట పతి సుతులు,క్రృష్ణచక్రోపమ ఆస్థ రాగ మీతోన్!