Posts

Showing posts from November, 2023

రసానంది!

Image
    మేలిమి బంగరు ముద్ద తీసి,మాలిమి విరికళగ          మలచి,     పోలిక లేని దళ శోభాక్రృతి జేసి,మధ్యనొక పచ్చ      నుంచి,    లాలిత్యముల రాశి,రస వారాసి, వివిధతా ప్రీత్య       వతంసి    లీలారచన గావించెనె,నయనమనోహర సమ్మో         హకమై!

హరివిల్లు!

Image
1 హరివిల్లు కలిపెనే ఈ దిశ నా దిశను రాగ శోభల హరి శ్రీవెంకటేశు,దిశలన్నియు తానైన వాని, వీటిపై! సిరి,"కంటిరె,ఇంద్రచాపము వెలసె శిఖరముపై యన హరి,"నీ రవ్వనగల జిలుగులవి యని నవ్విన వేళన్    ******* 2 ఏ బ్రృందారక తతు లల్లన దిగెనో వన్నెల  వంతెన నుండి/ ఈ భూ వైకుంఠమునకు,శ్రీలక్ష్మీరమణు స్థిరావాసముకున్ ******    3 సప్త గిరినాథు గోపురముపై వెలసెనే, ఈ సప్త వర్ణి ఆప్తజన రక్షకు కీర్తి చూచెడి వేడుక, రప్పించెనేమో?! ********.         *********         *********  

రాగ సిరి!

Image
   విరిసెనే సంజ వన్నెల జిలుగుల, నింత కొసరి           తెచ్చినట్లు    విరిసినే హరివిల్లు రేఖ యొకొటి,  బహుమతి             గొనినట్లు     విరిసెనే శైలబాల చేతి గోరింటకెంపు,మది    తోచినట్లు    మురిసెనే సుమవని,రాగసిరుల నా సాటి                  ఏదనుచున్ !

కుందరాగము!!

Image
క్షీరాబ్ధి బుట్టి, హరి యురము చేరిన లక్ష్మి,నవ్వు సిరియై సర్వశ్వేత, సరస్వతి శ్రవణభూషా సితకాంతి పర్వమై కరుణాలయ గౌరీ కటాక్షలతాంత వికసిత  విరియై గురువార శుభోదయ వేళ,గురు మ్రృదువచో ధవళమై!!

నిసర్గ మోహనం!!

Image
   ఆకసము,భూతలము చెరి‌ సగము గీసిన బొమ్మ       యిది,    వీకముగ వన్నెల వెల్గు వితరణల వియస్స్థలి           కూర్ప,    ఆక్రృతుల కనువుగ కొమ్మల,ఆకుల వసుధ              యమర్ప!    ప్రక్రృతి చిత్రకారిణియైన, వాక్రుచ్చ నేర్తుమె ఆ           సౌరులన్ !