హరివిల్లు!

1

హరివిల్లు కలిపెనే ఈ దిశ నా దిశను రాగ శోభల

హరి శ్రీవెంకటేశు,దిశలన్నియు తానైన వాని, వీటిపై!

సిరి,"కంటిరె,ఇంద్రచాపము వెలసె శిఖరముపై యన

హరి,"నీ రవ్వనగల జిలుగులవి యని నవ్విన వేళన్   

*******

2

ఏ బ్రృందారక తతు లల్లన దిగెనో వన్నెల 

వంతెన నుండి/

ఈ భూ వైకుంఠమునకు,శ్రీలక్ష్మీరమణు స్థిరావాసముకున్

******   

3

సప్త గిరినాథు గోపురముపై వెలసెనే, ఈ సప్త వర్ణి

ఆప్తజన రక్షకు కీర్తి చూచెడి వేడుక, రప్పించెనేమో?!

********.         *********         *********

 


Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!