Posts

Showing posts from June, 2024

తరణి-ధరణి!

Image
    వెలసె తరణి రాజు ఉదయ గిరిపై లేబ్రాయపు      కాంతుల/     తలచి ఆ శోభ లెగసె ధరణి యెడద మాత్రృతా      దీప్తుల!/     కలుగు నిక కేదారానందామ్రృతము కర్షక లోక      శ్రీదమై/     ఫలములవే శాంతి సౌఖ్య నామముల జనుల     ‌‌ హ్రృదుల యంచున్!

అచ్చెరువు!

Image
     ఒత్తుగ తారామణుల కూర్చిన ఆకసపు తునుక     యొకటి/    ఇత్తరువున నిత్తఱి నిధ్ధరణి వేడ్క మీరగ     దిగినట్లు/    నెత్తావుల నెఱిచూపుల మా పోలికలె యచ్చెరు     విదేమని/    చిత్తముల వితర్కించు ఉద్యానవిరు ల్గుసగుస         లాడినట్లున్ !

ఏలనో?!

Image
      పేశల కలశులుగ పూల చేసిన కళాపూర్ణుడె      ఆశల కాలరాచి రేపె నేల రాలగ జేయునేలో?!     మోసులు వేసి మొగ్గ తొడిగి కలలు విరియు లోపె     వీస మనుకంప లేక శూన్యమై కరుగ జేయునేలో

తల్లి!

Image
     వాలుదున,ఆగుదున,ఆగుదున వాలుదున      అని/      గాలిలో యీదేటి ఈ పులుగు కెంత ముందు               వెనుకలో/      అలుపు తీర  విరామమ,కూనల కింత      ‌. ఓగిరమ/      తేలక సుంత! తల్లులొక్క తీరు కాదె,జాతి       యేదైనన్!!