పూజలో శ్యామక్రిష్ణ!! ఒరయు కావేరి స్నానమాడి వెలుగు రేకల పల్కరించుచు/ సరిగంచు పట్టు ధోవతితో విభూతి కుంకుమల మించుచూ! **** పూదోట తానె గోరానిన మందార మల్లెలు మంచి గంధాలు/ చేదాల్చు వెండి సజ్జ పద పదమన చేరెనే అమ్మ గుడికి!! **** వేద కాంతియై భాసించు సిరిమోముతో సామోద సదాక్రృతి/ సుధ్ధ్యాన ముద్రయె నడచినట్లు శ్యామక్రృష్ణ,తల్లి పూజకై! **** నుత శచీశ సేనాని, క్షిప్ర ప్రసాదిని,సుతు కానో, పరాకేల?/ నత జన పాలిని, అమ్మ మాటాడవేల నాతో,యని వగచె! **** బంగరు కామాక్షి మందిరమ,హ్రృదియె జనని మంటపమ/ పొంగెడు అందెల నాదము సాగె, నెవ్వరు వినని సవ్వడియై!! ...