Posts

Showing posts from May, 2022

కొంటే,ఖర్చే!

Image
      అచ్చపు కూరలమ్మి,కూర లమ్మగ తానె       వచ్చె, కొనవలదు,పాపం !తరిగి, పోవు!!

జాలి!

Image
       గుండు చిన్నవోయె మరి చిన్నవాని గుండె                 ఖిన్నమాయె/        ఉండనీయరె సుఖమున నన్నీ పెద్దలని         జాలిగన్!!                          *****     (సుఖం తెలియని పెద్దల అజ్ఞానం పట్ల జాలి)

వాణీం వందే!!

Image
వాణీ బాలాం కరధ్రృత పుస్తకాక్షమాలాం కాశ  శుభ్రాం/ మణి వలయాలంక్రృతాం, కౌశేయ సురుచిర  వసనాం/ నానా శాస్త్ర కళా హాటకాభరణ భాస్వద్వర గళాం/ ఏణీలోచనీం, హంసస్యందినీం, నౌమి విద్యా స్వరూపిణీం!

ఔర అన్నమయ్య!!

Image
అన్నన్న ఓ అన్నమయ్య ఎటుల వ్రాసితివయ్య అన్ని వేల మన్నన గల పదము లా స్వామి దర్శనము కేగు వేళల సన్నని ముత్తెంపు టక్కరములై విభుని నుదుట తోచెనో కన్పట్టని దివ్య ఘంటమున తానె నీ మనో ఫలకమున!                                (ii) రచియించెనో,నేటికి పూజా కుసుమములై,మా గ్రృహమ్ముల/ నంచిత నిత్యార్చనా గీతులై వరలె, మా పుణ్య మూలమ్మునన్!!                               *****

ఆసచర్యం!!

Image
        తెల్లని వెలుగుల నింగి రేని కేమాయెనో         బల్ వింతల కొంగొత్త పోకడల నేర్చినాడు!        చలువ జోళ్ళు దాల్చును,నవ్వుకొను బీరాన!         తుల ఏది నాకని,తీయును రాగాలేవియో!!             సభ

తెలిసెనులే!!

Image
అది శేషుని రత్న ఫణమ,గాదిలి సౌమిత్రి చేతి సురటియ!/ అదిలక్ష్మి అనపాయిత్వమ,అవనిజా త్రపా ముగ్ధ సాన్నిధ్యమ!/ బూదిరాయని మారురూపమ, గంధవహ సుతు సద్భక్తిదాస్యమ!/ ఆ దైత్య వంశ తులసియ,నీ నామజపిత సంగీత కలశియ!                               (ii) ఎ వ్వరయ్య, యజ్ఞఫలమ,రామచంద్ర,కౌసల్యా నంద వర్ధన, నీ/ వెవ్వరయ్య, కారుణ్య వర్ష, నీలాభ్ర వర్ణ, సాక్షా ద్విష్ణువు గాకన్!!                            *****

నాద యోగి!!

Image
                 వలదనె రాజ ధనముల, మెరమెచ్చపు జేజేల, నిలిపెనె రామునె సొంపైన చంపకపు తలపుల!  సలిపెనె నూరుకోట్లను దరియ నామ జపముల కలిసెనె ఆ రామబ్రహ్మములో,నాదయోగమునన్!!

మంగళం!

Image
         ఇదేమి కాల కళాంశా సుసంగతియొ !          చందనోత్సవ సింహాద్రి నారసింహపు,          ఇందిరా ప్రభల అక్షయ త్రృతీయల          సుందర మేళన, మంగళ వాసరమై!!

బ్రాహ్మీ శోభ!!

Image
           హరి చేల మట్లు వెలుగు రేకల             బంగరు  సౌరుల/            హరి నీల వర్ణమట్లు గగనాస్తరణ             విస్త్రృతుల/            మరిదేని కోరని నారాయణీయ             శాంత  సుశోభల/            సరియె లేని నేత్రపర్వ ప్రాభాత             సౌందర్య మిదిగో!!