అనామిక!
అనామిక! కుంద మందారమును కాను,సురభిళ పారిజాత మును గాను/ అంద మిడిన దైవ మే పెంపేరిడని రాదారి చిరు మొక్కను/ విందుమే గాని అంతవాడని ఇంత వాడని కరు ణాళువని/ పొందనేరమే దైవదర్శనములు, పూచి రాలుటె మా యోగమై!!