Posts

Showing posts from September, 2022

ఏకానేక!!

Image
ఏకానేక!! ఇంటి పనుల నష్టాదశ భుజ,ఇంటి పొదుపుల  శ్రీ లక్ష్మి,/ వంట,వడ్డనల అన్నపూర్ణ, పిల్లల చదివించుట వాణి,/ కంటి ఆజ్ఞలనె యధ్వర్యము జేయుట న్పర్వత రాజపుత్రి/ పంటి కింది రాయై కడు వేధించు తుంటరులకు దుర్గాశక్తి!                               ****** చెలరేగు నన్యాయముల నెదిర్చి చెండాడుట భద్ర కాళి/ ఖలుల  నణచుటను మహిషమర్దిని, లక్ష్యపూర్తి న్చండి!/ విలువ యెంతని,యెటు కట్టెదవయ ఓ పురుష పుంగవ!/ కలిమియై నిల్చె కాదె, నీ యింటనె నవశక్తు లేకత్రమై!!                               ******

కొలువమరె!!

Image
      వెలసితిరే దేవత లొక్క చోట యీ నెలవు,      పలు వన్నెల చెన్ను మీరె నీ బొమ్మల కొలువు      అలుపెరుగక నమర్చిన యీ ఇంట కలిమి,      విలువెరిగి కనిన ఘనుల కిదె బలిమి!!

మందారోదయము!

Image
    ప్రాభాత వీచికల,అలనల్ల నూగె మందారము     నభోమణిని దర్శించిన సానంద మకరందమై!!

శాసన కాఠిన్యం!!

Image
పతి పరిత్యక్త ఆ సీత దీనయై,యొంటియై,అగ్రజు యాన/  నతిక్రమించ నేరమి  సౌమిత్రి యటవి విడచిన  వేళ,/ అతి వివిక్తముల,తారాడు వెలుగు నీడల,సుప్త  తరు/ తతి న్నిశ్చేష్టయై నిల్వ, వనదేవత యుస్సురని నట్లున్!

ఏమందువో?!

Image
    అమ్మరొ,నీ పదాబ్జ దయాసువనముల వ్రాల              మందువో/    కొమ్మల, గుణ సీమల సిగ, నెత్తావుల నింప    మందువో/    కమ్మని విందై, జనుల  కనుగవ  కర్పణ     కమ్మందువో/    ఇమ్ముగ విరిసి వేచితి మానతి నీవె,     పాటలీ  ప్రభా!!                              ****** ("పదాబ్జ వనం" లో సాముద్రికం సూచితం! పద్మ శంఖ ముద్రాంకితాలు,ఆ పాదాలు అని! అట్లా ముద్రాంకితాలైన ఆ పాదాలు,దయా వనాలు! అందులో మళ్ళీ పద్మాలు!)

పోయి రారా!!

Image
  క్షేమముగ పోయి రాగదె, ఓ వర సిధ్ధి గణపయ్య,   అమ్మకై భక్తి నెదురు చూసేము,మేమను కబురుతో!   నమ్మకముల యీ పుడమి పులకించి వేచె నిదిగో   శ్రీ మాత రాకకై, జనుల యెదల చల్లని రాకయై!!                               ******              (రాక=రావటం; రాక=పున్నమి)

గట్టివాడు!!

Image
మట్టితో జేసి పట్టు పుట్టముల భ్రమ కల్పించెనే! ఎట్టి చేయి తిరిగిన శిల్పియొ,పెట్టుడి నమము లుట్టి పడె కళ,యీ పార్వతి ముద్దుపట్టి మోమున గట్టిగ నమ్మిన, గట్టెక్కింప గల దిట్టరి సుమ్మీ!! *************************************** (కర్ణాటక లో‌ హొన్నవర అనే ఊళ్ళో జీ డీ భట్ట్ అనే  ఆయన చేసినది,మట్టితో! ఆ ధోవతి,,ఉత్తరీయం కూడా మట్టి తోనే చేశారట!)

పట్ట నేరని వాడు!!

Image
పట్టు తలపాగ చుట్టిరే,తాపసులె పట్ట నేరని  వానికి/ కట్ట బోయిన, నోట లోకాల చుట్టచుట్టీ చూపిన ఘనునికి/ పుట్టుగ్రుడ్డి సభ న్గారవ పుట్టముల,చెల్లి గాచిన వానికి/ బెట్టుల బోక,పెంపేద మిత్రు చేతి నటుకులు గొన్న వానికి!                         ‌‌‌‌ ‌‌                                    (ii) ఏ భూష మకుటమయ్య జగదేక పతికి,వేద  సంకీర్తికి/ సద్భక్తి నిడిన,తోయములనె తనియు, నల్ప సంతోషికిన్!                                ******