Posts

Showing posts from January, 2024

స్వాగతం!

Image
    విరి లోక మంగళ కాహళులై తోచెనే ముగ్ధ                మందారములు/     వ రాల హేమంత పల్లకి నవతరించు పౌష్య     ల క్ష్మి  కాహ్వాన/     స్వరలహరుల నంపు యిలాతల సుమాకార     ప్రతినిధులై!/     ఈరికలౌ ప్రీతికరముల నిడు శ్రీద సితాంబుజమై      నవ్వన్!

తరుణి!!

Image
కనుల నవ్వుచు లోకము లేలు సహజ కౌశలము పనుల నొడుపుగ జేయు, తులలేని పనితనము మనసు నెంచిన,నందనము జేయు సుమకోమలము కినుక బూనిన,జాతకమె మార్చు గడుసుదనము!√√