Posts

Showing posts from November, 2022

ఆకు ముత్తెములు!

Image
తెరపి లేని వానల జోరెంతైన,అంత మురిపెమేమొ కురియు శీకర బాలల కబురు లంత మధురమేమొ మెరసె ముత్తెంపు గుళికలైన నర్తన సలిలముల నరటి యాకులు,నిలిచి నిలువని వర్ష బిందువులన్!!

మణికర్ణిక!!

Image
      అహో,స్వాభిమానమె రూపెత్తిన రాచలోకపు       కీర్తి శిఖ/        సాహసమె యూపిరియై,పొలికలను దూకిన       వీర ఖడ్గ/        కుహనమ్ముల  శ్వేత  శ్రృగాలముల పాలిటి       పంచాస్య నఖ/       ఈ హైందవజాతి ఆచంద్రతారార్క మంజలించు       నారీప్రభ!

స్వరాక్షర!!

Image
                              స్వరాక్షర!! సరిగ,సరి సరిగ నీవు పదమని/ మరి మరి చెప్పెడి పథము సంగీతము!/ సరి సమ పదముల గరిమయె మాతు/ మరి శ్రుతి సుభగ సరిగమలె ధాతు!                    **** స్వరాది!!   బర్హి,వ్రృషభ,అజ,క్రౌంచ,పిక,వాజి కర్యాదుల ధ్వనులె/ హరి హరాదు లౌదల లూపెడి,సప్తస్వరముల కాదులు!/ ప్రక్రృతి సిధ్ధముల కళగ తీర్చిరి,గాన ఋషి  వరులు/ ప్రక్రృతినె పులకితగ జేయ,నెందరో మహా నుభావులు !!                        ****

నిరోష్ఠం!!

Image
                      (శ్రీ ముత్తయ్య భాగవతార్)                         నిరోష్ఠం!! ఘన కనక రత్న హార ధర గాత్ర శ్రియుడు/ సునాద లహర్యనేక  క్రృతిఝరీ సాగరుడు/ ఆనూక తుల్య నూతన శ్లాఘ్య రాగ దుకూలుడు/ అనూన ఖ్యాత,గాయన కళా సుధా కలశుడున్!!                              *** (ఓష్ఠ్య రహితంగా వ్రాసినది,ఆయనకు నివాళిగా) ***************************** (ఓష్ఠము=పెదవి; ఆయన  కనుక్కున్న కొత్త రాగాల్లో కర్ణరంజని,బుధమనోహరి,విజయసరస్వతి మొదలైన రాగాలతో పాటు "నిరోష్ఠం",అని ఒకటున్నది. ఇది పెదవులతో పలికే స్వరాలు,మ,ప లు వాడబడనిది. అంటే ఓష్ఠ్య రహితం! ఆయన ఆ రాగంలో కూర్చిన "రాజరాజరాధితే..."లో కూడా ఓష్ఠ్యాలు వాడకుండా వ్రాశారు.) :

రజత వల్లి!!

Image
      త్రిభుజముల త్రిభుజములు,వర్తులముల        వర్తులములు/       శోభల గూర్చెడు దీపాలంకారము లందందు               కనువిందులై/        శుభ ప్రదమౌ శ్రీ  చక్ర  సహజాత యగునొ        ఈ రంగవల్లి,/        అబ్జాసన,సువర్ణాభ లక్ష్మి మెచ్చు కౌశలమై,        నిజముగన్!

సౌందర్యధార!!

Image
      అంగజు గాచిన యగజ మానస పుత్రు తొలి              రూపైనట్లు/       చెంగట లేని సీత చీర సౌరై, రామచంద్రుకు                తోచినట్లు/       బంగరు, లేలేత రేకుల లతాంత శిల్పమై        వెలసినట్లు/       ముంగిటి గడప పసిమి,వేడుక పుష్పాక్రృతి                దాల్చినట్లు!!                                 (ii)       భంగము లేని సుందరతా ధార,ఆ దేవదేవు        కల్పనా ఝరి/       చెంగనాల్కావె ననలు,వన్నెలు, సొబగు చిన్నెలై        యీ యిలన్ !                                 *****                             ...

తులసి-క్రృష్ణ!

Image
      బ్రృందాంగన హ్రృది ఆనంద తుందిలమయ్యె      అందరు వేడు గోవిందుడు, తానై దరిసి      చిందెడు నవ్వుల కలశపు  నీరు  వోయ,      కుందనపు సురభుల హరిత  కందమై!

శ్రీ బాలమురళి!!

Image
1 బాలుడె వీడు?!,సంగీతజ్ఞాన పితామహ  సన్నిభుడు,/ ఖేలనమై సహకార విశేషముల నారి తేరుచు!/ అల లీలాక్రృష్ణు మాడ్కి,పాడునది తానె, వాయులీన/ తాళవాద్య గోపికాక్రృతియును,గాంధర్వ బ్రృందావనిన్!! **************************************** 2 మొక్కెద మంగళంపల్లి మురళీరూప సరస్వతికి అక్కజమౌ పూర్వార్జిత సుసంగీత ధనదాక్రృతికి పెక్కు వాద్య విశేషముల నశేష ప్రతిభా జ్యోతికి చుక్కల తాకు ఆంధ్ర శేముషీ జయకేతన దీప్తికిన్ !!

నర్తన తులసి!!

Image
√     ఆడెనమ్మ దయా కలశి, శ్రీ తులసి,తల యూచి,     వీడె వచ్చె నా అంతరంగపూర్ణ పీయూష సరసి     వాడవాడల రాగమయ మొనర్చు స్వర మురళి,     వీడని తావుల గోవింద సుందరు డనుకొనుచున్!!