Posts

Showing posts from December, 2023

ధ్యాస!!

Image
       పిల్లికూన కే ధ్యాసయో,పిల్లపిడుగేది వాయించిన!     కాచిన    పాల సువాసనలూరించె దాని,నుల్లము పూవాయె     వానికిన్!                                      ****

వితరణ!

Image
     ఏమి వితరణ శ్రీ కరము లహో క్రృష్ణ విభువి       చూడరె      మోము చక్కదన మిత్తువ యనిన,కౌముదీనాథు       కిచ్చెను      గోముల యడిగిన కలువ రాణికి,పద మ్రృదు             నీలము,      హైమ పటము కాంతి,కేసరములకు,నవస్మేర      ములన్!

పాపం నేను!

Image
1 కట్టవమ్మ కట్టు ఈ రీతి గట్టిగ త్రాట,బాలు నదుపు  జేసి! పట్టి! పాలిత్తు రారమ్మనిన కుహనను మట్టుబెట్టి నందుకు పట్టి పల్రక్కసుల నొంటిచేయి యుక్కడగించి నందుకు నీట చెట్ట విషముల నింపు వక్రగామి బుధ్ధి చక్కజేసినందుకు                                   (ii)  మీ ఇంట, మీవాడ, మీహ్రృదుల నవ్వు పువ్వులు పూయించినందుకు నా ఇంతలు కన్నుల తడి నోపక, విప్పెదవని, నే  నెరుగనే?! *** 2 ఏమి జేసినానమ్మ అంత కోపము,నందుని  యిల్లాల భూమి,నే మొదటినే యల్లరి జేసినది,మున్నెన్నడు వింటివె అమ్మల యిటు చేటుల త్రాట కొమరుల గట్టిన  చరితల?! కమ్మదనముల యెద గల‌ కూరిమి పట్టుగొమ్మ, యశోదమ్మ!                                (ii) రిపిళ్ళ మేన చిచ్చు బుట్టెనే,జగతి గుండ్రమై  తిరిగెనే/ చొరనిక పరుల యిళ్ళ,మ్రుచ్చిల వెన్నల,ముడుల విప్పవే! ****  3 వందామహే దామోదర మరిధరం జగత్సంపోష ణోదారం నందయశోదాశుభ్ర హ్రృత్సారస నీలారవింద దివ్యామోదం బ్రృందావన సుభ్...

పిట్ట మనసు!

Image
           తీపిపాటల పిట్టమనసున ఏమున్నదో,దానికే       ఎరుక,      ఆపనే ఆప దలుపె చూపదు,రాగ మాలికల      సందడుల!      ఏ పూవన్నె సొబగుల మెప్పుదలలో, ఏ జామి           తరితీపులో      ఏ పూత ఏరెమ్మ ఏమొగ్గ ఊసో, నీ మదితో               పంచుకోవాలని!!

ఋషి కొండ!

Image
    ఏ ముని ఋషివరులా కొండకొమ్మున తపము          లాచరించిరొ/     ఈ మరకత హరిత,సలిలాలయ తీర మందె      మన కీర్తి!/     విమల పర్యావరణ దూతలై సమీర బాలలు      పల్కరింప,/     ‌సామోదుల,సోత్సహుల-దర్శించు సహస్రాధిక         పర్యాటకులన్!

రెండూ కోతులే!!

Image
       సందేహమేమి,దానికి సహజము ఆ కోతి బుధ్ధి,      వంద కోతులకు సమానమట బాల బ్రహ్మచారి!      ఎందేమి యల్లరి చేసి కాజేసిరో,ఈ పండొకటి      విందు చేయుచున్నారహో,ఇకఇకల నిర్వురున్ !