పాపం నేను!


1

కట్టవమ్మ కట్టు ఈ రీతి గట్టిగ త్రాట,బాలు నదుపు 

జేసి!

పట్టి! పాలిత్తు రారమ్మనిన కుహనను మట్టుబెట్టి

నందుకు

పట్టి పల్రక్కసుల నొంటిచేయి యుక్కడగించి నందుకు నీట

చెట్ట విషముల నింపు వక్రగామి బుధ్ధి చక్కజేసినందుకు

                                  (ii) 

మీ ఇంట, మీవాడ, మీహ్రృదుల నవ్వు పువ్వులు పూయించినందుకు

నా ఇంతలు కన్నుల తడి నోపక, విప్పెదవని, నే 

నెరుగనే?!

***

2

ఏమి జేసినానమ్మ అంత కోపము,నందుని 

యిల్లాల

భూమి,నే మొదటినే యల్లరి జేసినది,మున్నెన్నడు వింటివె

అమ్మల యిటు చేటుల త్రాట కొమరుల గట్టిన 

చరితల?!

కమ్మదనముల యెద గల‌ కూరిమి పట్టుగొమ్మ, యశోదమ్మ!

                               (ii)

రిపిళ్ళ మేన చిచ్చు బుట్టెనే,జగతి గుండ్రమై 

తిరిగెనే/

చొరనిక పరుల యిళ్ళ,మ్రుచ్చిల వెన్నల,ముడుల విప్పవే!

****

 3

వందామహే దామోదర మరిధరం జగత్సంపోష

ణోదారం

నందయశోదాశుభ్ర హ్రృత్సారస నీలారవింద దివ్యామోదం

బ్రృందావన సుభ్రూమణిగణ చిత్తాకర్షక ఝంక్రృతి

నాదం 

సుందర కాళిందీతట వంశీపూరణరత మానంద

కందం!!

******

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!