సుమ బంధం!
శిశిరంలో పూర్తిగా ఆకు రాలిపోయి,మళ్ళీ తొందర గానే పచ్చటి ఆకులతో వచ్చేసి,గుత్తిగా విరిసిన ఈ రాధా మనోహరాలిచ్చిన వసంతాగమన ఆనందం గూర్చి...... సుమ బంధం! *** వచ్చినాయె ననల మెత్తలు తిరిగొచ్చినాయె ఆకురాలి బోసియైన కొమ్మపై మరల విరిసి! ముంగిటిమురిపెపు మొక్కతో తీయని బంధం పాదుచేసినీరుపోసి పెంచిన మమతల గంధం! చివురులేసి మొగ్గతొడిగి రాధామనోహరమైతే ఆ వేణుగానలోలుడె సన్నగ నవ్విన చందం! దళం హరిత సుందరం, సుమం కోమలారుణం గళం విప్పి పాడమనే విరిబాల సరాగం! ***