సుమ బంధం!
శిశిరంలో పూర్తిగా ఆకు రాలిపోయి,మళ్ళీ తొందర గానే పచ్చటి ఆకులతో వచ్చేసి,గుత్తిగా విరిసిన ఈ రాధా మనోహరాలిచ్చిన వసంతాగమన ఆనందం గూర్చి......
సుమ బంధం!
***
వచ్చినాయె ననల మెత్తలు తిరిగొచ్చినాయె
ఆకురాలి బోసియైన కొమ్మపై మరల విరిసి!
ముంగిటిమురిపెపు మొక్కతో తీయని బంధం
పాదుచేసినీరుపోసి పెంచిన మమతల గంధం!
చివురులేసి మొగ్గతొడిగి రాధామనోహరమైతే
ఆ వేణుగానలోలుడె సన్నగ నవ్విన చందం!
దళం హరిత సుందరం, సుమం కోమలారుణం
గళం విప్పి పాడమనే విరిబాల సరాగం!
***
Comments
Post a Comment