విరి (యు) వైనము!




 గుప్పిటల దాచిన రత్న మాణిక్య ధగ ధగలను
ఒప్పుగ భద్రహస్తముల విప్పి చెప్పు వైనమున
ఇప్పూల ఠీవులేమొ,విరిసినవి కనుగవకు విందె
మెప్పుగ క్రమసుందరమై విరియునవియున్!!

విరిసిన విరి అందమ?! విరియుటయుఅందమ?!
విరియు దశ నందుట అందమ?!విరియ జేసిన
కరము అందమ,మనఃసుమ భావగంధములగొని 
అరమరికలేమి లేక నిజముగ చెపుమ లీలాకృష్ణా



Comments

Popular posts from this blog

అతిథి!

ఎదురు చూపులు!