Posts

Showing posts from August, 2021

మువ్వురు మువ్వురే!!

Image
కొమ్మ పైని కోయిల కూజితమది, వీణలో              పల్కించినదొకరు/ కమ్మని పాటలను,శ్యామసుందరు వేణువట్లు కూర్చినదొకరు/ అమ్మ, సంగీతవాణి గారపుపట్టిగ,రాగముల నింపినదొకరు/ చెమ్మగిలు కనులు,మువ్వురి కళానైపుణి,భక్తి గౌరవములన్!!

చిర కీర్తి!!

Image
 అన్నమిడి ప్రేమతో ఆకలి తీర్చిన ఈ అన్నపూర్ణ  కన్నతల్లి వలె అందర నాదరించిన దయాపూర్ణ!  ఉన్నది,జనుల కిచ్చుటకనిన దాత్రృ మహార్ణవ  చెన్నగు,ఆచంద్రతారార్క ధ్రువకీర్తి,డొక్కా సీతమ్మ!!

మారమణం వందే!

Image
                     రాగానేక స్రజ మండిత లోచనోత్సవుని            జేగీయమాన రూపామేయ కరుణాలయుని           రాగానంత గీత కీర్తిత సుగుణార్ణవుని           వేగీక్రృత వితరణు మా రమణు చూడరే!!

శ్రీపాద!!

Image
                                   శ్రీపాద!           సాము గరిడీలలో జబ్బలు చరచిన జోదు          .ఏమి రోగమో ఇట్టె కనిపెట్టు పేరున్న వెజ్జ           సామ గాన సారమున ఒజ్జలకె తొలి ఒజ్జ           అమరపురి కేగె శతాయువై,విమలహ్రృది!         శ్రీ పాద,సంగీత శిక్షణా,రచనా యాగ హోత!         ఆ పినాకపాణీ సమాశుతోష సుస్వర దాత!         శ్రీపాద,స్వర సుధాన్వేషిత శిష్య తీర్థపాద!         అపార గీత పారావార చుళుకీక్రృత ధీవర!          ఆ  పినాకపాణి, నాద మయ తనువు!          ఈ పినాకపాణి, రాగ లయ గురువు!!          ఆ పినాకపాణి,  సుర నదీ  ధరుడు!          ఈ పినాకపాణి, స్వర నదీ హ్రృదుడు!!        

అపూర్వము!!

Image
                          అపూర్వము!! కాంస్య పతకమ అది?!కాదు కాదు,కాంచన సమమె! ఆశయ సిధ్ధికై తపియించిన సింధూ క్రృషి ఫలము! ఆశలు పూలు పూయ,భరతమాత స్మిత వదనము! విశ్వ రంగమున మువ్వన్నెల జెండాకో కీర్తిధ్వజము!! ( రెండు ఒలింపిక్ పోటీలలో వరుసగా,individual పతకాలు సాధించటం ఒక Record!!  కనుక, "అపూర్వము" !)