Posts

Showing posts from January, 2023

చిలుకల రాట్నం!!

Image
వాలిన చిలుక నిలువదు వాలిన చోట,తొందరలేమొ! వాలిన దేదో,ఎగసినదేదో తెలియదు,తుర్రుమనుటె! కిలకిలమనుచు,సందడుల రాకపోకల సంరంభమె! పల్కెడి పులుగుల,ఎగిరెడి పచ్చల,వేడుక వింతయై !                                ****

పౌష్యలక్ష్మి!

Image
పట్టు పరికిణీ గర గరల, బెట్టు పల్కుల  గల గలల/ బిట్టు పుడమి తల్లి మది పులకించ,ముగ్గు లేసిరే లేమలు! జట్టులై వచ్చు ఆ హరిదాసుల,ఈ గంగిరె ద్దాసామి జోరుల/ కష్ట ఫలమై పుట్ల ధాన్యాలు,బళ్ళ సందళ్ళ వేగ  నిలు జేర!                                   (ii) సంక్రాంతిలక్ష్మి తనిసి,మొగము వేయందముల విరిసినట్లు/ ఏ  కాలమైన  పరుల  కిచ్చినదె, అసలు  సిరి యనినట్లు !!                                 *****                    కనుమ సందేశము!! కనుమ నాడు గొనుమ ప్రతిన,దయ పొంగారగ కనియెద  నేనెల్ల ప్రాణుల నని,కనగ నిను కనుగవ  తోచని ఆ  అనంత శక్తి కరుణతో!శాంతమె నీదు శ్వాసాంతము నిక్కమౌ/ ధనము కాదె,నీ దయ చుట్టమైనిన్నె సుఖియింప జేయగన్! *************************************** హనుమ సందేశము లోకమాత హవ్యవహ పూత  సీతకు నూరట నీయగ! కనుమ సందేశము ప్రాణత్రాత లా గవ్య బ్రృంద...

సంక్రాంతి!!

Image
    రసము లూరు చెరకు లొచ్చె పరుగు పరుగున      మెరసిపోవు కలిమి, పసిమి యొచ్చె సరగున    అరటి,పెరటి పచ్చలొలుకు వనలక్ష్మి అయ్యె    సురభులన్ని పొంగి పొరలు పాల కడవలయ్యె√√   సూర్య మూర్తి చలిని చీల్చు విష్ణుదేవు చక్రమయ్యె   అరయ మకర సంక్రాంతి సకల సమ్రృధ్ధి అయ్యె!!√√