శరన్నవములొచ్చే రా రావమ్మ గిరి రాజ నందినీ! వర సిద్ది గణేశుతో,స్మరకోటి లావణ్య స్కందుతో! **** కనక ధారా వర్షి, హరి అనుగు దేవేరి, లక్ష్మితో పూర్ణవిద్యా కలశి,విధి చెలిమి కాణాచి,వాణితో! **** నిర్విఘ్నకార్యులై,నిర్జితారులై,శ్రీ,విద్యా,ఘనులై,నీ సర్వాభయ రక్ష, అక్షయాంబ,దుర్గ, జనులెల్ల వెల్గ! . **** రాలేదనుకోము ,దేహార్ధమై నీ లోనే లేడే శివుడు! ఫాలాక్షుడైన, జాలి గల యెద,భవహరుడు సదా! **** (రెండు,మూడు,నాలుగు పాదాలకు,5 వ పాదం తో క్రమాలంకార బంధం)