నటేశ విశేషం!! అంతరిక్ష వీథుల సంరంభమున పరుగిడు అనంత/ జ్యోతిర్గణముల,నిశ్చిత పథుల,నియత వేగులుగ/ గతి బధ్ధ మౌన జతి, కక్ష్యల నాడించునే వటమూల/ స్థిత శివమూర్తి, వాడె,భరతాచార్యుడీ విశ్వవేదికిన్! **** ఆనంద తాండవమన ఆ చిదంబరు నర్తన హేల అనంత సృష్టి స్థితిలయల,వర్తుల భ్రమణ లీల!! **** పంచకృత్య సంపుటీ సుదర్శనమె,హస్తాంఘ్రి విన్యాసార్భటి/ ప్రచలిత ప్రతనోణు గర్భ మధ్య మహఛ్ఛక్తీ సంకేతమై!! **** విశ్వ లయసమన్వయ కౌశల పోలమె నట రాజ గభీర/ మాశాద్యనవఛ్ఛిన్నాక్షర చతుర్బాహ్వాతతము, నర్తనోత్థిత/ మాశామోహభ్రృదవిద్యా నిర్దలన పాద ద్వంద్వము, మ్రృత్యుంజయ/ మా శిరస్థ ప్రతీకయై, సర్వాభయద శివ సుందర మూర్తిగన్!! ...