నటేశ విశేషం!
నటేశ విశేషం!!
అంతరిక్ష వీథుల సంరంభమున పరుగిడు అనంత/
జ్యోతిర్గణముల,నిశ్చిత పథుల,నియత వేగులుగ/
గతి బధ్ధ మౌన జతి, కక్ష్యల నాడించునే వటమూల/
స్థిత శివమూర్తి, వాడె,భరతాచార్యుడీ విశ్వవేదికిన్!
****
ఆనంద తాండవమన ఆ చిదంబరు నర్తన హేల
అనంత సృష్టి స్థితిలయల,వర్తుల భ్రమణ లీల!!
****
పంచకృత్య సంపుటీ సుదర్శనమె,హస్తాంఘ్రి విన్యాసార్భటి/
ప్రచలిత ప్రతనోణు గర్భ మధ్య మహఛ్ఛక్తీ సంకేతమై!!
****
విశ్వ లయసమన్వయ కౌశల పోలమె నట
రాజ గభీర/
మాశాద్యనవఛ్ఛిన్నాక్షర చతుర్బాహ్వాతతము,
నర్తనోత్థిత/
మాశామోహభ్రృదవిద్యా నిర్దలన పాద ద్వంద్వము,
మ్రృత్యుంజయ/
మా శిరస్థ ప్రతీకయై, సర్వాభయద శివ సుందర
మూర్తిగన్!!
****
(అంతరిక్ష,కైలాస,పరమాణు,విగ్రహ ప్రసక్తి, ఆ క్రమంలో)
Comments
Post a Comment