Posts

Showing posts from May, 2023

త్రివిధ!

Image
                                  త్రివిధ: 1.ఉమ హ్రృది: హరుడటే,లోక కల్మష హరుడటే,శశికలా  ధరుడటే/ కోరి కరము కోరి,ఆ కరకు శీతాతపముల  తపియించి/ నిరాహారనై,నిర్జలనై,అపర్ణనై ధ్యానింప  ప్రసన్నమైన/  ఆరనిఅనాదిదీపమె,జగదాధారమె,నా మహద్భాగ్యమే!! ***** 2.శివ హ్రృది: నాలోని సగమై తోచు,నాదు సంకల్ప ద్రృశ్యరూపమై వెల్గు/ మేలారయ, వాగర్ధ సంప్రృక్తత తోచు, నిరతైక పూర్ణతన్! *****  3.పాఠమిది: ఆమె అస్తోక తుహినాద్రిరాజ నందిని,అత డాది దేవుడు!/ ఈ మారుడె,కుసుమాస్త్రములె చాలుచాలు మేరు ధనువు కని,/ ఏమరి,సంధించి మల్లీ మాలతి శరముల తాపస హ్రృదిపై/ నిముషమున రూపరె యనంగుడై,భస్మీభూతాలేఖ్య తనువై!                             (ii) ఓర్తురె, పెద్దలు జగచ్చాలన చణు లితరుల ప్రమేయము/ నేర్తురు కారె,ఒద్దిక సతులతో జీవించుట మన్మథులైనన్!! *******

ఆదిదంపతుల ఆటవిడుపు!!

Image
1 అందముగ ఏమి సంగతి వేయునో జగదంబిక  యని/  చంద్రశేఖరు డెదురుచూసె సోల్లసియై,వీణాపా ణియై!/ చిదానందరూప జగద్భాండానేక ఈ మహదధ్వ ర్యుల/  కాది దంపతుల కిది ఆటవిడుపేమొ, నాదాత్ము లకున్! **** 2 హిమనగము మురిసె,ఆ తలలోని గంగ  కదలదయ్యె/ సుమధనువు తనిసె,సిగ నెలవంక వెన్నెల  లొలికె,/ ఆ మెడలోని ఫణి పరవశించె,అపురూపమీ ఘడియ/   ఏమి పున్నెమొ శైవముల కీ  భాగ్యమబ్బె, యనుచు వినుచున్! ********

రాక!!

Image
మంచు బిందువుల నేస్తులిదె వచ్చిరని గులాబి మురిపెము/ మంచి మిత్రుల సౌరభాదరమని నింగి చుక్కల సంబరము !                              *****

మారవే అమ్మ!!

Image
     ఏనాటి దానవో ఓ యమ్మ,వైనంగ చేటతో                 చెరగుచున్నావు/      ఈ నాడు ఏ వీట కనరాని,అలనాటి కళయె       యిది తల్లి!/      ఒనగూడెనెన్నొ సౌలభ్యము లాడువా రలయక         వండివార్చ/      వెనుకబడకె,అనువుల వీడి,చెమటోడ్చు      ‌‌             ఉపాయములన్ !

తల్లి!!

Image
                                 తల్లి!! ఏ నాటికైన ఆ ఇంటికి సాగనంపక తప్పని ఈ నా చిట్టి/   ఈ నాటి నును చివురు పాదమిది, నా దోయిలిని అద్ది పట్టి!/     నానాటి కింతింతయై రాణి లాగ వెలగాలని ఈ కన్న తల్లి,/   ఏ నాటి కీలాగె చేతుల్లొ బొమ్మయై ఆడాలని,ఓ వెర్రి కోర్కి!! ******************************************** (భూమిజ యైన సీత గురించి,తల్లి భూదేవి అనుకున్నట్టు! 1.సీతారామకళ్యాణం,రాజ్య త్యాగం. 2.వనవాసంలో రాముడిని అనుగమించటం 3.అగ్ని ప్రవేశం 4.లవకుశుల నప్పగించి,భూమిని చేరటం-సూచితాలు!) ఈ సుపది యే శ్రీ కరముల చేపట్టి, యే పదవి త్యజించునో/ ఈ పదము లే సుపదముల పట్ట యే వని కనుగమించునో/ ఈ పదము లే కటుపథముల నోర్వ మి, ఏ పావకమగునో/ ఈ పదము లే దుష్ప్రథల బాపి నిర్లిప్తయై,నాలోనె చేరునో!             ‌‌.       *****

యశోద పరుగు!!

Image
పట్టరె పట్టరె సిగను పింఛము వాని,ఉంగరముల జుట్టు వాని/ నిట్ట నిలువు కస్తురి నామము కలవాని,కలువ కన్నుల వాని/ పుట్టుభోగైన వాని,భుజకీర్తుల వాని,కర వలయ ముల వాని/ ,   పట్టు దట్టివాని,అల్లరి బల్దిట్ట వాని,బిట్టు వెరవు సిరి వాని/                                (ii) పట్టరె,నా కనుల ముక్కారు పంటవాని,నవ్వు వెన్నెలల పట్టుని/ జెట్టి ఈరేడు భువనములకు,లక్ష్మి వీడని ఉరము గట్టి  వానిన్!!

అమ్మ!!

Image
ఉప్పుమూట నేనై బాగ ఊరేగుటకు పల్లకీ మా అమ్మే/ చెప్పి మైమరపించు,కంచికి పోని కథల కల్పవల్లి అమ్మే/ మెప్పు పొందినను,తప్పు చేసిన, చెప్పుకొను దేవి అమ్మే/ గొప్పగ పేరైనను, నా 'కన్న' యని నోరార పిలచున దమ్మే!                                  ****