Posts

Showing posts from April, 2023

పాట!

Image
పాట లేనిదె, పక్షి ఎగురలేదు,బంగరు   రెక్కలున్నను/ పాట లేనిదె,గోవు పాలీయలేదు,పొదుగు లుప్పొంగినను/ పాట లేనిదె,అళి మధువానలే దలరు  ల్పిలచినను/   పాట లేనిదె,నరు డసలె కదలలేడు, సిరులున్నను!                                 (ii) పాట కాదె యూపిరి,ఈ భువి జీవాళికి,  భగవద్వరమై,/ చేటుల బాపు,బరువుల దింపు,నాదసుధా మధురిమయై!  ****** (From a video of a "Singing Bird",singing merrily)

సూరదాసు!!

Image
కన్నులు లేకున్న నేమి లో కన్ను విప్పారె క్రృష్ణ నామ దళముల/ వెన్నునిచే వెన్నల దొంగిల జేసి,బొంకాడను నేర్పె సన్నుతిగ/ ఎన్నెన్నుల  మై మరతు రనన్య భక్తు ల్పన్నగశాయి  యన్నిటయై/ ఛన్నతల్వీడ మనో ఫలకముల గాంతురొ, లీలలు, ధన్యాత్ముల్ !

బధ్ధక(ఆ)మ్!!

Image
                          బధ్ధకామ్! గుత్తులుగ తియతీయని మావిడి పళ్ళోయ్, అంతెత్తుల వ్రేలాడిన మాకేమి ఫలమోయ్?! సుంత తామె ఆకు రెక్కల వాలి కంచముల, వంతేల రసమిదె గొనుమన్న, ఎంత బాగో!!

గడియారం!!

Image
         టిక్కు టిక్కు టిక్కు టిక్కు గడియారం          పక్క చూపు  లేనె   లేని   వ్యవహారం           చక్క  నైన    అంకె  లన్ని  నేత్ర సమం          ఒక్క  మాట  పల్క లేని   సాక్షి వైనం!!!

ఏలకులు!!

Image
                  ఏలకుల చెట్టు మొగ్గలతో! ఇల్లింతలె కాయలు చూడ,జగతి పేరెన్నిక గన్న యేలకులు/ అల్లంత దూరములకిట్టె పర్వెడి సుగంధపు రుచి గుళికలు/ అల్లరి మాటల చేతల క్రిష్ణుతో తుల,పట్టిచ్చెడి  సురభుల,/ తల్లి నీలవేణులకా వెంకటేశు లడ్డువుల కామోద వహులై!!

అరుణాచల శివ!

Image
                      అరుణాచల శివ!! అరుణాచల అరుణాచల అరుణాచల యనుచు మార్మ్రోగు,ఈ/ శ్రీ రమణాద్భుత, కరచరణాన్విత, ఆత్మావతార క్షేత్రము/ తిరువణ్ణామలై కాదె, గిరి  పరివ్రృత ఘన తాపసి వాసము/ అరినాశని,ఆ భవాని కొల్చిన గణపతి ముని సేవితమున్!!

వేప త్రయం!!

Image
                            వేప త్రయం!! 1 వేప తినగ చేదేమొ కాని,యెన్ని లాభములుర/ ఏ పగిది చూసిన బాగె, ఒంటికి, ఇంటికి మరి/ మీ పసిడి మై చాయకును,మీ దంతపు సిరి వెల్గు/ కా పర్వెడి కనుల చలువ కాంతికి,మీ మన్కికిన్! ***** 2 వేప ఉండనె వలయు,ఆ మామిడి పులుపు,బెల్లపు తీపుల/ ఒప్పగు నేస్తమై,మన ఉగాది పచ్చ డిలో,పోపుల వింతయై! **** ( ఈ "పోపు", వాటికన్ లో కాదు ఉండేది,మన వంటింట్లో!!) ***** 3 వేప,సొగసుల పత్రాభిరామము,శ్వేత పుష్పాభిరామము/ ఓపలేని తిక్తమైనను, మేల్జేయు దివ్యౌషధాభిరామము/ ఆ పైర గాలి కూగేటి రెమ్మల,హరిత నేత్రాభిరామము/ మీ పొలమునలసిన తరి,సేదతీర్చు ఛాయాభిరామమున్                             *****