పాట!


పాట లేనిదె, పక్షి ఎగురలేదు,బంగరు  
రెక్కలున్నను/
పాట లేనిదె,గోవు పాలీయలేదు,పొదుగు లుప్పొంగినను/
పాట లేనిదె,అళి మధువానలే దలరు 
ల్పిలచినను/  
పాట లేనిదె,నరు డసలె కదలలేడు,
సిరులున్నను!
                                (ii)
పాట కాదె యూపిరి,ఈ భువి జీవాళికి, 
భగవద్వరమై,/
చేటుల బాపు,బరువుల దింపు,నాదసుధా మధురిమయై! 
******
(From a video of a "Singing Bird",singing
merrily)

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!