Posts

Showing posts from August, 2025

శుభోదయం!

Image
   శుభోదయమ్మనె చినుకు ముత్యాల బంగరు కలశి     నొదిగి     సుభద్ర నభో రథములు, ప్రభాకర దేవు నర్చించ        లేవరే!

దేవి చేత?!

Image
              వారు వంగి నడిచిన, చేత కాక               వీరు వంగి నడిచిన, చిలిపి చేత!                                  ***             (చిలిపితనం చేత; చిలిపి పని అని కూడా!)

బాలానందం!

Image
తల మీద పిట్ట, తన పక్కనో పిట్ట, సూసేది  పై నున్న  పిట్ట/ అలవోక కొమ్మెక్కి కూసున్న చిన్నారి, మురిపెంపు పైడి పుట్ట!

నిత్యానందులు!

Image
     దారి పక్కన తరుల దళ పుష్ప ఫలాదు       లందరి సొత్తని/       చేరి,యొకరి మూపొక రెక్కి కోయుచున్నారు       పిల్లలు మురిసి/      కూర్మి వనలక్ష్మి యిడిన కానుకలని మదుల       రూఢి నమ్మి/       ఏరితోనైన కలసిపోవు నిత్యానందులు       బ్రహ్మస్వరూపులై!!