విరివర!! పంచ దళముల నవోత్ఫుల్ల మందారమది/ పంచ విరిశరము లోటువడిన పీఠమున/ పంచాగ్నుల నడుమను తపియించిన కోమలి/ మంచుగుబ్బలి సూతికి జయ,ప్రియకారి కాదే/ (ii) మించు కన్నుల ఱేని కొలుచు తఱి,దీని చూచి,/ చూచె స్వామి తన్నంచు,ఆ దేవి సమాదరింపన్!! వివరణ: "మందార కుసుమ ప్రియా" అనే లలితా సహస్ర నామం ఏర్పటానికి,ఒక కారణం ఇందులో చూపించే ప్రయత్నం ! ఎక్కడైతే, మన్మధుడు అపజయం పాలయ్యాడో, ఆ ప్రదేశం లో,అంటే శివుడు ధ్యానం లో ఉన్న చోట,ఈ మందారము ఆమెకు విజయ కారి అయింది అని! ఆయన పూజకై, ఈ మందారాలు తీసుకు వెళ్ళినపుడు ముందుగా పూలను చూసి, తరువాతే తనను చూసి ప్రసన్నుడయ్యాడు . ఆ రకంగా ఇవి విజయ కారకాలు అయినయ్యి, పార్వతికి,కనుకనే ఎప్పటికీ ఆమెకు అత్యంత ప్రీతికరమైనవిగా మిగిలి పోయినాయి అని!! ...