Posts

Showing posts from March, 2022

ఇంటి పుదీనా!!

Image
              ఇదేనా, బలే!,మీ ఇంటి పుదీనా/               ఉదారంగ పూసి, కాపు కాసేనా?!               సదా ఆదరంగ,  నీరాడిస్తేన/               ముదాకరమే వంట,ఇంటిలోన!!

అరె,జారినాడే!!

Image
    అందమైన వెల్గు మామ,చిక్కినట్టె చిక్కినాడె,            బుట్టలోన!/     అందరికీ కనువిందౌ,! కట్టులోపె, జారినాడె                నింగిలోన!!

కమలాలయ!!

Image
జయజయ కమలాలయ, ముకురా నన,కుటిలాలక, సురుచిర రామే/ జయజయ  పరివేష్టిత  శుభవారణ, బహు కీర్తిత  వర గుణ దీపే/ జయజయ శుచిశోభిత  బుధమానస  చిరవాసిని, హరియుర భూషే/ జయజయ సిత సుస్మిత, విధు సోదరి, శ్రితమోదిని,  స్మరశత రూపే!                   *******

మఱుగు!

Image
    చీర చెరగు మఱుగులు కావలెనె ఈ బుడత              లిర్వురకు/     వర సిధ్ధి వినాయకుడొకడు తారకాంతక                    స్కందుడొకడు/     మురిపెముగ జగదంబ పరచు లీలయె కాని,     కననోపు/     వారు కనరె ఆవరణల దాటి తరగని నిత్య                సత్యమున్!!                             *****

బరువు నవ్వు!

Image
ఎట్టా మోస్తి వక్క అన్ని బరువుల, చిరునవ్వుల! తట్టలో దేవుళ్ళ మాగొప్ప బరువు,నిన్నంటుకొని చిట్టి హాయైన బరువు,మనసులోన కూడు గూడు నెట్ట, వెరవు బరువు,బూలచ్చి వీవె, దండాలివే!

శ్రీ రాఘవేంద్ర!

Image
                      శ్రీ రాఘవేంద్ర!! తుంగభద్రా తీరమున వెలసిన గుణ భద్రు/ సంగ వర్జితు,సద్గురు రాయర, ప్రహ్లాదావతా/ రాంఘ్రి కమలముల సేవింతు ననిశము,/ భ్రృంగ సమునై,తద్రజ భక్తి సౌర భమానన్!!                        ***** వీణా వాదన చణికి,ఆ సర్వశాస్త్రార్ధ కాణాచికి/ పుణ్యాకార దేశిక వరేణ్యు,కణకువ మ్రొక్కెదన్!!                         *****