మైత్రి!! Get link Facebook X Pinterest Email Other Apps - July 28, 2021 అమ్మ కనబడనిదె బెంగయె బెంగిక నాకు, అమ్మను చూసినదె,చెంగు చెంగున నీవు! గుమ్మ పాల,కంచికెళ్ళని కథల మరపించు అమ్మలుండ,మన కాటపాటలె మిత్రమా!! Read more
సూర్య సర్వం!! Get link Facebook X Pinterest Email Other Apps - July 14, 2021 అరుణారుణ కిరణ ప్రచండుడా ప్రాణ దాత హరిత కిసలయ సుశోభలా తరు వ్రాతము ఎర్రని వేడిమి లేక, పచ్చని పైరు చూతువె? సూర్య ప్రభల వినా చల్లని వెన్నెల దక్కునె?! Read more
జై జగన్నాథ!! Get link Facebook X Pinterest Email Other Apps - July 12, 2021 సుర నందనవన పారిజాత స్యందనమున స్వారి వెడలె నేడు,పూరీ మాడవీథుల హరి, సిరి నేలు, భూరి కరుణల, జగ దధికారి! మరి మరి మ్రొక్కరె,మరి మ్రొక్క నక్కర లేకన్!! **** క్రృష్ణావరజ సుభద్ర దలచి పారిజాత పేశలములు/ క్రృష్ణాగ్రజు బలభద్రు నెంచి వీరత్వ కేతన సుప్రభలు/ క్రృష్ణు,దుర్జనాసహిష్ణు,గుణవర్ధిష్ణు,భావించి, స్యందనము/ క్రృష్ణ మయములా తలపులు రథ నిర్మాతకు భక్తి పేర్మిన్ !! ********( Read more
నామ ప్రభ! Get link Facebook X Pinterest Email Other Apps - July 11, 2021 బంగరు కాసుల పేరు ధగ ధగలాడె భ్రృంగ కుంతల,ఆ రాజరాజేశ్వరి మేన! మంగళ కరముగ, కాసుకొక నామము పొంగులీన దేదీప్య ప్రభల,ద్రృక్పర్వమై!! Read more
గోరింట!! Get link Facebook X Pinterest Email Other Apps - July 09, 2021 ఇంతలాయె కనులు,విప్పారె మొగము ఇంతుల కెంతయొ గోరింట సంబరము! చేత కెంపుల వూయించు పచ్చటి ఆకు వింతగ, నందర మురిపించు కల్మి రేకు!! Read more
వెన్న దొంగ! Get link Facebook X Pinterest Email Other Apps - July 07, 2021 తిన్నది యేమున్నదోయి,నీలి వన్నెల దొర! ఉన్నది పుష్టి యనిన మాట వమ్మై పోవగ వెన్నల, నేల పాల్జేసి చల్లగ జారుదువు! వెన్నెల మ్రృదు పద ముద్రల వీడుచు క్రృష్ణా!! Read more
ఓం నమో వేంకటేశాయ!! Get link Facebook X Pinterest Email Other Apps - July 03, 2021 అశేష సంఖ్యల నిను దర్శించు భక్త జనుల విశేష దయా సువీక్షణముల శాంతి కూర్తువు సాశామతుల కనంత మనోరథ సంపూర్తితో అసంగ నిరీహుల కానందవల్లీ పోషణతో! (ii) దోషము లెన్నక మమ్మాదరించు జగత్పితవు శ్రీ శ! వీడకుర కరమెన్నడు, శ్రీ వేంకటేశా!! 2 కోర్కెల వారికి కొంగు పసిడియె,కోరని సూరికి పొంగు ఆనందమె,నీ సుదర్శనము! ధరను ధర్మ జీవన ఆలంబమై నిల్చి,మా పరముకై వెల్గు జూపు పెన్మహిమర అది!! (ii) అండపిండబ్రహ్మాండముల,లీల నేలు ఱేడ! కొండలరాయ! తిరుమలేశ! రమాహ్రృదీశా! Read more
గగనమణి! Get link Facebook X Pinterest Email Other Apps - July 01, 2021 నవోదయ విరుల,దళ సాంజలుల ఆ వ్యోమ,వరకాంతుల దాత్రృమణికి సవినయ సుప్రభాత ప్రణతులివె,, శ్రీ విష్ణు, ప్రత్యక్ష సుద్రూపుడగుటన్!! **** విరిసె నదె మింట, తొలిపొద్దు సిరి! మురిసెనీ ఇల, ముధ్ధు లొలికే విరి! ఆరని వెల్గు,ఆ పెన్సిరియె లేకున్న ధర,విరి లేదు,వరి లేదు చూడన్!! **** Read more