Posts

Showing posts from September, 2023

బుడత చరిత!

Image
కరుణామూర్తులు నీలాభ్రశ్యాము లాజానుబాహు లహో వీరెవ్వరయ్య, వారిధి బంధన వ్యగ్ర మానసులని, చిరు సాయము చేసిన ఆ ఉడుత చిరజీవి యయ్యె!  నిరతోత్సహి న్గనరె,రామ కరస్పర్శా భాగ్య న్ధన్యన్!! **** ఆ కొమ్మ కెగతునా,కూసింత చూతునా యని వేచి,  చూచి చూచి/ శంకల, తుర్రున వెన్కకు పారు తరుప్రియ  ధీరలీ  ఉడుతల్! **** ఆ కట్టడమె మహేంద్రగిరి,తానె సాగరలంఘన మహాకార్య వీకమౌ ఆంజనేయమను రీతి చూడరె చిక్రోడ విన్యాసమున్! ****

తొలి కిరణం!!

Image
పులుగుల కువకువల,ఆ సలిలపు గలగలల, అలరుల/  కలకలల,ఇలకిదె మేలుకొలుపు,మరియొక ఉదయముకు!/ కలుముల కిరణముల,ఇరులవి పరువిడగ  బిరబిరను/, వెలుగుల ఆదిదేవుకు జనులివె నుతులనగ  నతశిరులై !!

వెన్నెల వాక!!

నీటి లోన మురిసి తానమాడెనే నిండు పున్నమల రేడు/ ఏటి పేరే మారెనే,వెన్నెలల వాగై,ఆ రాజు మహి మన్!!