బుడత చరిత!
కరుణామూర్తులు నీలాభ్రశ్యాము లాజానుబాహు లహో
వీరెవ్వరయ్య, వారిధి బంధన వ్యగ్ర మానసులని,
చిరు సాయము చేసిన ఆ ఉడుత చిరజీవి యయ్యె!
నిరతోత్సహి న్గనరె,రామ కరస్పర్శా భాగ్య న్ధన్యన్!!
****
ఆ కొమ్మ కెగతునా,కూసింత చూతునా యని వేచి,
చూచి చూచి/
శంకల, తుర్రున వెన్కకు పారు తరుప్రియ ధీరలీ
ఉడుతల్!
****
ఆ కట్టడమె మహేంద్రగిరి,తానె సాగరలంఘన మహాకార్య
వీకమౌ ఆంజనేయమను రీతి చూడరె చిక్రోడ విన్యాసమున్!
****
Comments
Post a Comment