Posts

Showing posts from June, 2021

కరివేప!

Image
                           1        ఏరకుమయ్య కరివేపను నీ కూరలలో       మరి మరి లాభముల నిచ్చు వరదాయిని!       అర కొరల ఆకు కాదు, కంటికి,పంటికి       సరి సరి,నీ ఒంటినె కాపాడు రక్ష రేకు!!                            2      కరివేప, నేరి పారవేయకుమో నరస భూప!     అరుల,లోలోని ఆరోగ్య హరులను తల గొట్టి,     మరి సిరులిచ్చు,కడు వెల్గ నీదు వదన కాంతి!     మరువకుమ,పైడి కంచపు పచ్చని సువరమున్!!

చంద్రహంస!!

Image
మెల్లగ సరసున తేలియాడు రాజ మరాళము పోలిక, అల్లన నీలిఆకసమున సాగుచు రాజబింబ మొప్పెన్

నిలకడ!!

Image
             రంగుల రాణి ఈ పక్షి తీరు కనరె              భంగిమ పట్టి,అట్టె నిల్చెను గాలిలో!              ఆ గాలినె బంధించి,మనసు కట్టిన              యోగి పోలికగ,ద్రృష్టియు తదేకమై!

స్నేహం!

Image
      కొమ్మ ఏమన నెంచెనో, ఆ వెన్నెల రెమ్మతో       కమ్మని పూల తావుల, నే నంపెదననియో       అమ్మ ,మా సంపదల లక్ష్మికి,జోతలనియో       అమ్మకచెల్ల!ఏమి సౌఖ్యమీ స్నేహమనియో?!

అవిభాజ్యము!!

Image
కౌసల్యానందవర్ధనము సుమిత్రా నేత్రానందము  ఆశాంత పరివ్యాప్త యుగాబాధిత సుబాంధవ్యము! ఆ శాంతాకార శేషశయ్యా ద్వయమై క్షీరవారాశి అశేష నెయ్యమున సోదర యుగ్మమై వనవాటి !!

సేవాతురలు!!

Image
  నీలాలు,అరుణిమల శోభలు,సంజ కెంజాయలవి!     కొలనిలో విరబూయు ననల ఎదురు చూపులవె!    ఏలా చికుర సుగంధ ఆ జనని భవాని సేవకై,   ఏలా గొంపోరిక,వేళాయెను,ప్రాభాత పూజకంచున్!

బాల్యం!

Image
    పట్టుటకు ఆకు దక్క, పదివేలనుచు నవ్వులు     గట్టుపై మాట కచ్చేరి చేయుచు, సందడి నవ్వులు     చెట్టు చేమల పచ్చదనముల, కేరింతల నవ్వులు     జట్టు గట్టిన నేస్తుల, చీకాకులెరుగని నవ్వులు!!

శిల్ప చాతురి!!

Image
మెత్తని మైనమును మలచిన తీరుల రాతికే జీవము పోసి నాతిని  చేయగ, చేతిలో అద్దము చూచి దిద్దె కుంకుమల నతివ నెన్నుదుట,భంగిమ సౌరు మీర!                     (ii) ఓహో సుందర యనునొ కుహూ స్వరముల స్నేహాప్తయై,ఆ యువ శిల్పి అచ్చెరువొందన్!?

శైవం!

Image
        అన్ని దారులు చేరెడి సంగమ కేంద్రము         పన్నగ ధారికి హరు కనుంగు ధామము         ఆ నగ శీర్ష హిమవ దద్భుత దేశము         పుణ్య కేదారమిది శివోదార సారమై!!                             ******

పైకేనా?!

Image
గాలిలో ఈదెడి మీనము పోలిన ఈ విమానమున సోలుచు సొక్కుచును చేసెదవో చంద్రయానమును అలుపె లేదె నీ ఆశలకో మానవ! మానవ ఇటు చలువ మామ పై దాడి,ఇల బేలగ,జాలిగ నవ్వన్!!

తొలి నమస్సు!

Image
    తరురాజ కదంబవాటీ  స్థిత జగదంబాసుత     హేరంబ! జన హ్రృదంబర వీథుల వెల్గర సదా     కార్య తరంగ అభంగ హేతువు నిను తలపగ     నిరంతరము,సర్వారంభ సిధ్ధి,అందర కందన్!!

విరి శంఖం!

Image
   పాలసంద్రపు పాల మీగడలొ, దాని తరగల    ఓలలాడెడి తెలి నురుగులొ,అందె వెలసిన    ఆ లక్ష్మి సుస్మిత కాంతులొ,దొంతరల విరి శంఖ    శిల్పి కాదరువేమిటో,స్వాదు సామోద ధవళమై !!