Posts

Showing posts from November, 2020

భావన!

Image
సుధా సాగర మధ్యమను మహావరణను దాట/ ఉద్యన్మణి ద్వీపము,ఆ లోన బిల్వాటవి,ఆవల/ కదంబ వన వాటిక,ఈ జాంబూనద ప్రభల విరి/ వదనము శోభిలె కాదె శ్రీ లలితావాస భవ్యమై!

తెల్లని అల్లరి!

Image
       పాల,పెరుగుల పారబోసి,పాత్రల విరచి/        ఆల,దూడల దరి జేరిచి,పాలన్ని ముగిసి/        చేలపుటంచుల అత్త కోడండ్రవి ముడివేసి/        లీలల నుంకించు బాలక్రిష్ణుని తలపులట్లు!!

సుకాంతి!!

Image
       వర్షమునకొక్క సారియైన దీపావళి        కోరినప్పుడే ఈ నెమలికి!,పింఛపు        వర్ణ పటమంత వెల్గుపూల భరిణెలే        ఆరబోసె శ్రీకృష్ణ కిరీట సుకాంతులై!!        💐💐          💐💐💐          💐💐          (వెల్గు పూల భరిణె=చిచ్చుబుడ్డీ)

స్నేహం!!

Image
మేఘాల తాకు శిఖరాలు,శిఖరాలతో పలుకు మేఘాలు/ యుగయుగాలు గడచినా తీరని ముచ్చట లవెన్నియో/ అగరాజ పుత్రి తపములో,జనకతనయ కష్టములో,ఆ/ రాగపూర్ణ యక్షు విరహములో,ఎత్తుల తెలియ తరమే?!

మీరా!!

Image
  క్రృష్ణ గళమునకా మాల, క్రృష్ణ గానమునకా/  వీణ, బ్రృందావన వీధుల పాడిన గోపికయో/  అణువణువు క్రృష్ణభావసముత్ఫుల్ల,రాధయో/  ఏణీద్రృశ,మీరా,ఎన్నిజన్మల ప్రేమయోగినియో?!!

కార్తీకం!!

Image
   ఆర్తి, రార శివ యంచు నోరార పిలచిన/  గోప్త నీవని శ్రధ్ధగ సంప్రశ్న లడిగిన/  భర్త సకల భూతములకు,ఆ పశుపతి/  గర్తరి దాటింపడె మౌనవ్యాఖ్యా దీప్తులన్!                           ***  తులసీదామ విలసితు జేసిన మోదమున     దామోదరు,/  నలంకార ప్రియు నచ్యుతు నర్చించిన కార్తీక   కాంతుల/  అలరులై విడివడవె సంసార గ్రాహ   దంష్ట్రార్గళములు/  అల వికుంఠ పరిజన పదప్రాప్తియై   మత్తగజముకున్.                           ****  మాసమేమో కార్తీకము,నామము, శైవాత్మకము/  వాసమేమో శ్రీ హరిరూప మార్గశీర్షాంతికము/  ఈశ విష్ణు హ్రృదు లొక్కటి కాదె కందమేకమై/  శశ్వదానంద బీజ ఆశుతోష  వ్యక్త శోభలై!!                             ****

చెట్టునకున్న పూవు!!

Image
గోరానక మా ఆమ్మల కొంగుల,ఈ కొమ్మల యుంచిన/ మీ రాకపోకల, విరిశోభల కనువిందు  సేతుము/ మారాము లేమి సేయక, ఏమాశించని  మాలోకముల/ వేరు పరచిన,పెంధూళి కలసి,పోదు  మరయరే!

పాట పిట్ట!

Image
చిరుత పిట్టలు,పొడుగు ముక్కులు/ తుర్రుమని వెన్క కీదు ఈతగాళ్ళు/ పేరు లోనే రాగమున్న పాటగాళ్ళు/ హోరు లేకున్న, గోముల బేరగాళ్ళు!!                        **** ఇలా ఎందుకంటే, ( ఇది ఒక్కటే,పక్షుల్లో, వెనుకకు కూడా ఎగిరే పక్షిట! దీని ఇంగ్లీష్ పేరులోనే Humming ఉంది!)

సర్వోపగతుడు!!

Image
గిరి కంధర తమో పటల మహా గహనముల      పర్వత మాలికాంబరభాషిత విటంకముల స్ఫురత్తటిల్లతాంతర.భయదవిద్యుద్రాశుల నీరదమాలికా గుప్తపరిస్వఛ్ఛ వాఃకణముల                          ( ii) ఎందెందు కానము నీ ప్రభ, బ్రహ్మాండాంత సుద్రూప,హ్రృదస్ధ చిద్దీప, లక్ష్మీనారసింహా!!

హరిత సీత!

Image
పచ్చని పుట్టము కట్టే, పెన్నెరి వేణుల జార్చే అచ్చపు ధరణిజ ఈమె,రావణ బాధ లేనిదై!!

అన్ని వింతలే!!

Image
చిన్నది,నును చివురుల,మా పెరటి పచ్చని సిరితో/ అన్నది అనక,నే మాటాడిన, ఉలుకు,పలుకు లేదు!/ అన్నన్న,అంతలోవచ్చె వన్నెల పులుగొకటి పాడుచు ఎన్నైన పల్కునిది, ఏమనునో తెలియదె, వింతయై!!