కార్తీకం!!

 
 ఆర్తి, రార శివ యంచు నోరార పిలచిన/
 గోప్త నీవని శ్రధ్ధగ సంప్రశ్న లడిగిన/
 భర్త సకల భూతములకు,ఆ పశుపతి/
 గర్తరి దాటింపడె మౌనవ్యాఖ్యా దీప్తులన్!
                          ***
 తులసీదామ విలసితు జేసిన మోదమున     దామోదరు,/
 నలంకార ప్రియు నచ్యుతు నర్చించిన కార్తీక   కాంతుల/
 అలరులై విడివడవె సంసార గ్రాహ   దంష్ట్రార్గళములు/
 అల వికుంఠ పరిజన పదప్రాప్తియై   మత్తగజముకున్.
                          ****
 మాసమేమో కార్తీకము,నామము, శైవాత్మకము/
 వాసమేమో శ్రీ హరిరూప మార్గశీర్షాంతికము/
 ఈశ విష్ణు హ్రృదు లొక్కటి కాదె కందమేకమై/
 శశ్వదానంద బీజ ఆశుతోష  వ్యక్త శోభలై!!
                            ****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!