Posts

Showing posts from October, 2023

అరుణోదయం!!

Image
   ఎర్రా ఎర్రాని నేవళముల తూరుపూ గగనమోయ్    పరుగూ పరుగూన శిఖర మెక్కేటి ఆ సూర్యుడోయ్    సరగూ సరగూన పనులా చక్కబెట్ట సాగవోయ్   ‌ కరిగెనా దినము మలి సంజలో,తరి జారునోయ్!!

నవ్వుతూ కోపం!!

Image
                        నవ్వుతూ కోపం!!          పిల్లల యూహాపోహలకు హద్దులున్నవే          ఉల్లము,లెగసెడు హంస లైన వారికి          ఎల్లయు,వింతగ యక్కజ పడువారికి          ఇలు పీకి పందిరేయు,అ మాయకులకున్!

దేవతాపూర్ణము!

Image
తరుణారుణ వియ త్ప్రభలవి లలితాంబిక చాయలై వర సువర్ణాభములు హరి సతి లక్ష్మీ  ప్రసన్నములై సుర్నదీ వన్నెలా సర్వశ్వేత సరస్వతీ వెల్గు పాయలై, స్మర జనకు జగన్మోహక వపుకాంతులా నీలములై!                                   (ii)    ఆకాశాస్తరణ మొప్పె, త్రిశక్తీ సంవ్రృత వైష్ణవ     ధాతువై/    ముక్తసంగ ఘనులా యోగి హంసలు ప్రదక్షిణ             లాచరించన్!

మహాలక్ష్మ్యై నమః!

Image
ఇదె,విరిసి వేచెనమ్మ పూలచుక్కలు,యెన్నెన్ని పరుగులో యెదను,/ అందరి కాపుదల,దేవి ఇందిర లాక్షారుణ పద యుగళి  చేరను! 

దీవెన!

Image
                                దీవెన ! మా  యేటి చలువల్ల రక్ష, సూరీని కాచేటి  వెచ్చనీ  రక్ష/ ఈ యాయువుల,ఆకు దోసిళ్ళ నింపు,మా  తోట గాలుల రక్ష/ మా యపరంజి వెలిగేనులే పుడమి,మామంచి   పేరు  రక్ష/ ఈ యమ్మమ్మ నోటి దీవెనల, చేతి ప్రేమంపు  పెంపెద్ద  రక్ష!!

అమ్మాయి!!

Image
  ఉగ్గు పాలతో ప్రేమల పోసి,నీ బుగ్గ నిగ్గుల తీర్చిన      అమ్మ,  అమ్మాయిర/   మొగ్గతొడిగి మీ యింట,మెట్టినింటి విరియజేసిన        సోదరి, అమ్మాయిర/   సిగ్గుల దొంతరయై నీ చేయి పట్టి,నిను నిల్పిన నీ        గ్రృహిణి, అమ్మాయిర/   అగ్గలమౌ కూర్మి పంచి, ఎదుగనీర, వెలుగనీర,          అమ్మాయి నాద్రృతితోన్!!

విరివర!

Image
    నీట ఉదయించి,సముత్ఫుల్ల వేచెనే,విరి వర             యోగిని/     పాటల‌ ప్రభ శ్రీ భవాని సేవకై, ఏ కొదవ,యెద              లే కన్!