Posts

Showing posts from October, 2021

ఆది శిల్పి!!

Image
   ఎంతటి రస ధునివో సరసిజాక్ష నారాయణ!    వింతలు గొల్పుర నీదు సృష్టి నవ నవోన్మేషమై!    చెంతకు చేర్చి మేను లంతరంగము ల్పులకరించు    సంతస కారక రాగముల నల్లుదు వలరులన్!!

శ్రీ దీక్షితార్!!

Image
అక్షయ యోగ రాహస్య మణి నిక్షిప్త కీర్తనా మంజూషు/ డక్షీణ మంత్ర బల సార ప్రపూత క్రృతి చతు రాస్యుడు/ మోక్ష పురి కాశి న్చిదంబర దయాలబ్ధ శ్రీవి ద్యాఢ్యు డీ/ దీక్షితుడు, శ్రీ  మీనాక్షీ నిరత జపిత సాక్షా  ద్గుహుడే!!                         ****

పరమహంస!

Image
   నిజ సతి మూర్తి లోన త్రిలోక జననిని కాంచె    నెవ్వడు/    అజాండమంతయు భవాని అమేయ ప్రభయై    జూచె నెవ్వడు/    అజేయేంద్రియ గ్రామ మరికట్టి మనోన్మని     జేసెనెవ్వడు/     ఆ జగజ్జేత కా పరమహంసకు సప్రశ్రయ      నమముల్!!

గట్టు దాటె!

Image
               చెట్టు తెచ్చె,మట్టు గట్టె                పట్టు పట్టి,  నీరు పెట్టె                ఇట్టాయనేమిర, దాటి                గట్టు,వెలసె గెల,అటు!                          💐💐💐

కారుణ్యారుణి!!

Image
     ముఖ్య దేవతా మణి గణ పరివేష్టిత,రాజిలె       మహారాజ్ఞి/      ప్రఖ్యల కెల్ల ఆది,అనాది, బహుపురాణి, నిత్య         యౌవనయు!/      సాకల్య శుచిమతు లియ్యాశ్వీజ పుణ్య తిథుల       భక్తి కొల్వరె/      చీకాకు టిరుల పోకార్చు కారుణ్యారుణి శ్రీ రాజ         రాజేశ్వరిన్!                                       *****