వినియోగం!! Get link Facebook X Pinterest Email Other Apps - February 28, 2021 వెదురుల వేణురవమ్ముల వినుటయె కద్దు! అదరక బెదరక పాదచారు లవలీల అద్దరి జేరు వంతెనల కట్టిరద్భుతముగ! అద్దిరబన్న!విడువ రెద్దానిని గడసరుల్!! Read more
పోలిక!! Get link Facebook X Pinterest Email Other Apps - February 26, 2021 ఆకులె ఆకపచ్చని చిల్కల ఆక్రృతులై మిక్కుటమగు చెలిమి దరియ ముచ్చటాయె! ఆ కదళీ గుఛ్ఛమున గుసగుసల బోవు శాకావర మరటుల పోలిక,కనువిందై!! Read more
హరిణ చరిత!! Get link Facebook X Pinterest Email Other Apps - February 26, 2021 నిను దాల్చుట నిండుచందురుడు,అంకితుడయ్యే/ నిను కాంచుట సీత, కడు ఇడుముల నలిగే/ నిను పెంచుట జ్ఞాని భరతుడు,లంపటుడయ్యే/ వినుమ,నీ బేల చూపులెంత సమ్మోహకములో!! Read more
భీష్మ!! Get link Facebook X Pinterest Email Other Apps - February 23, 2021 పాండవ పక్ష దోష బుధ్ధివి,సాకల్య నిజ విక్రమము/ న్భండనమున చూపని మెరమెచ్చపు కయ్యము నీదని/ గుండెల నెంతగ మండించెనొ ఆతతాయి ఆ సుయోధను/ డడిదపు పోటుల బోలు మాటల,నో కురు పితామహ! (ii) గాండీవి అలుగులవి కడునెయ్యపు పల్కరింపులై నీ ఒడల యుండిపోయెనో శరతల్పశయన,శాంతనవా! ****** Read more
సప్తాశ్వి!! Get link Facebook X Pinterest Email Other Apps - February 19, 2021 ఘనులా తాపసి వరు ల్బహుకాలము శరీర చిత్త/ సునియమిత వ్రత ఫలమై పొందిన నీ దర్శనము/ లనంతాచ్యుత!అనాది దైవమ,ప్రభో,ఉదయగిరి/ ఆ నభోవీధి బ్రాహ్మ్యాదిగ బ్రహ్మవై,మాధ్యాహ్నశిఖల/ ( ii) కార్ష్ణ్యాంతక శివుడవై,సాయంవని శాంత నారాయణుడవై/ కరుణింతువే మమ్ము త్రిమూర్త్యాత్మక సూర్య బింబివై,నమస్తే!! Read more
నిర్మలమ్!! Get link Facebook X Pinterest Email Other Apps - February 18, 2021 ప్రాభాత వేళల సీతా సునయన మనోహరములు విభు రాకకై సాశామతులై వేచినట్లు,రామాక్రృతీ అద్భుత గాత్ర వరులా,కుశలవ రామాయణ గాన వైభవ సురభీ సాక్రృతులట్లు, వల్మీకాశ్రమమునన్! Read more
ఎందును అందమే!! Get link Facebook X Pinterest Email Other Apps - February 16, 2021 కొమ్మనే బహు పత్ర మధ్యయై అలరారిన, కొమ్మల పెన్నెరి వేణుల గోముగ కూర్చున్న అమ్మలగన్న ఆమ్మ పదముల వ్రాలినను ఇమ్మందారపు టరుణిమ లతిశయింపవే!! Read more
పరస్పరం!! Get link Facebook X Pinterest Email Other Apps - February 13, 2021 రాగరంజిత మృదుల సురభులు మీరని రెక్కల తేరు! రాగరంజిత మధురగాయకులు మీరని విరుల వారు! Read more
మైత్రి!! Get link Facebook X Pinterest Email Other Apps - February 08, 2021 అమ్మ,అన్నపూర్ణయె,విసుగెరగక పెట్టునని తెలియు/ కమ్మని భక్ష్యాదుల తాము పంచుకొనుట కద్దని తెలియు/ కొమ్మపై కాపు కాసిన రీతి,వేచుటేలనో మిత్రు లిర్వురు/ చమ్మగ దినుసంత గొని ఒక్కరు, పై కెగిరి పోవు నట్లున్!! Read more
బోళా!! Get link Facebook X Pinterest Email Other Apps - February 06, 2021 బిర బిర చర చర అటు నిటు పరుగిడు చిరు ఉడుతకు కడు నోరూరె,తాయిలమేది దొరికెనో! అర గింజకె పొంగు అల్పానందికిన్! Read more
ఏమి మాటలొ!! Get link Facebook X Pinterest Email Other Apps - February 05, 2021 వర వర్ణాంశువుల తరణి కళ ఒకటి తరుణారుణపు మురిపెమది వేరొకటి! ఇరు విరి సిరుల సరస భాషణమేమొ కరిరాజ వరదు దేవి,కమల తెలియు!! **** (వరవర్ణం=gold) Read more
మేడ మీద మేడ కట్టి!! Get link Facebook X Pinterest Email Other Apps - February 05, 2021 కులాలు డొడుపుగ చక్రమున త్రిప్పుచు మృత్తికను, పాల్పెరుగులు పట్టు చక్కని భాండముల చేయు రీతి, పలు వేల జనముల నలర్పజాలు ఆకాశహర్మ్య మలవోక చుట్టి నిల్పి రంచులా జాబిలి తాకునేమో! Read more
నీరు! Get link Facebook X Pinterest Email Other Apps - February 01, 2021 ఆకసమున ఎగిరిన,భూతలమున నడచిన/ చికిలింత పిట్టైన,మెకముల రేడైన,సమానమె! చింకిపాతల బీదైన,లోకమేలే రాజైన,సరియె! ఆకలి దప్పులొక్కటె,నీరే ప్రాణమై,జీవాధారమై! Read more