Posts

Showing posts from January, 2022

సుధ్యాని!!

Image
     అఃతట తానెయైన మేరు ధన్వి, చంద్రమౌ      ళీశ్వరుడు/      వింతయగు,తా ధ్యానించునే శశ్వదైశ్వర్య                 సంధాయినో?!/      అంతము నాదిలేని అనవఛ్ఛిన్న చిదానంద      ఘన/      శాంత తేజమౌ జగదాత్మకు, ధ్యేయ మితర               ముండునే?!!                              *****                           

నందిరథ నమో!!

Image
  ఎందెందు బోయిన,యెవ్వరేమి కోరినను,నవ్వుచు     ముందేమి చూడకను,యవ్వారి వరములనందించు   సుందరుడు, సోమేశ్వరు డిచ్చట, కొంగొత్త ఠీవుల   నందగించె, నంది నధిరోహించి, వందన మనరే!!                                 ****

క్షమా ద్వయి!

Image
క్షమా రూపయౌ క్ష్మా తలమున రంగవల్లుల తీర్చిర సమాన దక్షతల నంగన ల్జిలుగులౌ అల్లికల! అమ్మహి పోలికయె నక్షయ తాల్ములు కారె వీరును అమ్మలై,కడుపుల దాచి రక్షించు వాత్సల్య లక్ష్ములై!!                             ***      హైమావ్రృత గగన వీథుల నొద్దిక దాటి      మమ్మాదరింప వచ్చె నిదె కవోష్ణ కుశల,      ప్రేమామ్రృత సంవర్ష,పౌష్యాభ,సదార్భటిన్!      భామా కరాగ్ర నిస్స్రృత శ్రీకళా వల్లికయై!                               ***

శివ ధనుర్భంగం!!

Image
శివ ధనుర్భంగము!! వల్లె యనుచు గురువు విశ్వ మిత్రుడు నవ్వె,/ భళిర నా మిత్రుడని,పురహరుడు నవ్వె/ మాలా సుగంధముల, మా కళల సీత నవ్వే/ తలిదండ్రుల పెండ్లి యని సుమ ధన్వి నవ్వె.                      ****                        నవ్వె భూసుత కనువగు వరుడని జనకుడు, నవ్విరి/ సవనము ల్సాగునిక దనుజారి వచ్చెనని,ముని గణము/ అవేద్య సంత్రాసము పైగొన, దానవ కులమ్ము వీడె నవ్వు/   ఎల నవ్వుల రాముడా కార్ముకము నెత్తి రెండుగ జేయన్!!                         *** అనిదంపూర్వాద్రృశ్య పర్జన్యరాట్సు మహద్బ్రృంహిత మిదేమని/ వనచర సంఘాతముల్సు సంత్రాసి తములాయె,అంబర చుంబి/ ఘన తరంగావళుల పొంగెడు,అంభోనిధి సాకుంచితాలస/ ఊనోర్మికా క్రృశీభూతయై తోచె, నిర్జరపురి నవ్యవహిత                     (ii) కంబు స్వన జయరవమ్ము ల్బోరు కలగె,దనుజ కర ధ్రృత/ అంబు లసువు లవి జారె, చాప భంజనధ్ధ్వానా ద్భుతమ్మునన్!!    ...

సూర్య!!

Image
      ఆలంబమె లేదొంటి అంబరవీథి,ననూరుడు       సారథి/         ఏ లాభ మాశించక  కాంతుల వెల్లువ జేయు        వైతరణి/       ఇల ప్రాణముల నిల్పు ప్రత్యక్ష శ్రీమన్నారాయణ        మూర్తి/       తొలి కిరణమ్ములనె ఇరుల పారద్రోలు సుజ్ఞాన            పుంజి!!                                    *****

చిరునవ్వు!

చిరునవ్వు లక్ష వరహాలనిన తల్లి మురియు కాని/ ఆరవ ప్రాణపు కళలకు వెల కట్టు దురె, అనునో?!/ కోరి వహించిన ప్రేమ భరమీ వెన్నెల తునక!, కాదె/ కోరక మమూల్య మా జన్మాంతమీ అమ్మకు, కొమ్మ కనునో!                      *****

లక్ష్మీశః!!

రమా లలనా సుస్నేహాభంగ ఉమా సోదర కరుణాపాంగ క్షమా శోభిత సుబలోత్తుంగ మమ్మాదరింపవె పాండురంగ!!

ఎందుకో!!

Image
       అడవి పళ్ళ నేరి భక్తి నిచ్చిన ఆ శబరిని         బ్రోచినావు/        బుడి బుడి సైకతరేణువుల ఉడుత సాయమౌ           ననినావు        కడ కరి సోదరునె దరి జేర్చి లంకాధిపతి         చేసినావీ/        ఎడమేమి,కడకంట నన్జూడవు,జానకీపతీ,        జగత్పతీ!!                                   ******

మర్మము!!

Image
       ఆ కరి ప్రతీకయె,జీవుని నిరత మోహ         సుప్రతీకమై/        మకరి నొక కల్పనయే, సంసార పటు         బలవద్గ్రాహమై/        ఏక మనస్కత,  శ్రీ హరీ యని జీరు        శరణాగతులకె/         మోక్షపదప్రాప్తియని,మమతాహంకార       విదూరులకున్!!                                 ***

రామచంద్రీయం!!

Image
    ధర్మము నిలువెత్తు రూపై ఆక్రృతి దాల్చినట్లు,      శౌర్య  దాశరథి!     కూర్మి,కుటియె పతి సన్నిధి,భవ్యారామమౌనను     పుణ్య జానకి!       వర్మమై యన్న ననుసరించి సేవించు కొందునను     ధన్య సౌమిత్రి!     ఓర్మిమై, సీత కుసురులా రాము కాశల బోసిన      భక్త మారుతి!                                 *****