శివ ధనుర్భంగం!!

శివ ధనుర్భంగము!!

వల్లె యనుచు గురువు విశ్వ మిత్రుడు నవ్వె,/

భళిర నా మిత్రుడని,పురహరుడు నవ్వె/

మాలా సుగంధముల, మా కళల సీత నవ్వే/

తలిదండ్రుల పెండ్లి యని సుమ ధన్వి నవ్వె. 
                    ****
                      
నవ్వె భూసుత కనువగు వరుడని జనకుడు, నవ్విరి/

సవనము ల్సాగునిక దనుజారి వచ్చెనని,ముని గణము/

అవేద్య సంత్రాసము పైగొన, దానవ కులమ్ము వీడె నవ్వు/
 
ఎల నవ్వుల రాముడా కార్ముకము నెత్తి రెండుగ జేయన్!!
                        ***

అనిదంపూర్వాద్రృశ్య పర్జన్యరాట్సు మహద్బ్రృంహిత మిదేమని/

వనచర సంఘాతముల్సు సంత్రాసి తములాయె,అంబర చుంబి/

ఘన తరంగావళుల పొంగెడు,అంభోనిధి సాకుంచితాలస/

ఊనోర్మికా క్రృశీభూతయై తోచె, నిర్జరపురి నవ్యవహిత
                    (ii)
కంబు స్వన జయరవమ్ము ల్బోరు కలగె,దనుజ కర ధ్రృత/

అంబు లసువు లవి జారె, చాప భంజనధ్ధ్వానా ద్భుతమ్మునన్!!
                    ***
మెరసె నా న భాంగణమున తళత్తళలై/

మొరసె నీ స భాంగణమున ఫెళఫెళలై/

విరిసె అవనిజా ముఖాబ్జము కళకళలై/

తరుణ రఘోత్తమసింహ విక్రమ మధృష్యమై!!    
                      ***
ఆమె కోమలవల్లి, ఆతడగును ఘన మహా సాలము/

ఆమె వియత్ప్రభ, ఆతడొక నవ శ్యామ మోహనాభ్రము/

ఆమె హిరణ్మయి, శ్రీ లక్ష్మి, ఆతడ ప్రమేయ 
హరి ద్యుతి/

భూమి పులకించె, విరి వర్షమాయె, యయ్యు
ద్వహ వేళన్!!
                       *****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!