వర ఖడ్గముల తళతళ లట్లు కోరి పోరెడి సమద వీరులట్లు మెరసెడి కుశాగ్ర బుధ్ధియట్లును నేర్పరి శబ్దగ్రాహకు కళయట్లు!! రత్న ఫణి సర్రున జారిన యట్లు ద్రుత గతి నర్తకి భంగిమలట్లు జితేంద్రియు దైవీక స్ఫురణలట్లు సరిద్రమ వార్ధిసంగమ వీకమట్లు! సొంపగు కాళియమర్దనుని వల్గితములట్లు ఒప్పగు శిక్షని,గోప పెద్దల చప్పటులట్లు కప్పెడు చీకటుల నాగాంగనా చిత్తములట్లు తప్పుల సరిజేయు క్రృష్ణుని హాస రేఖలట్లు!! చిదంబరేశుని తాండవ మ్రృదంగమట్లు మ్రృదుల గౌరీ లాస్య రమ్య పదములట్లు ఆది దంపతీ సుపద స్పర్శా,పులకిత సంధ్యాంగణ మెగయుచు ఉప్పొంగినయట్లు!!