Posts

శివ గరిమ!

Image
సుడులు తిరుగు ఆ సుర గంగనె జటల కట్టిన శంభునకు   వడిగ పడు జలపాతమాట కాదె రవి ముందరి దీపికయై !

జాలి యెద!

Image
కన్న వానికేమొ చుట్ట గోచి లేదు,నీది చూడ చిరుగు  పాత వెన్న కాదె తల్లి నీ యెద,ఉన్నదానిలో పులుగు కింత పెట్ట!

పూల గంటలు!

Image
పూల గంటలు!        ** పూలగంటలు కట్టిరెవరో పాల మనసుల వారు తెలుపురేకు లెరుపు కప్పులు,కనుల కామెతలై!

అమ్మమ్మ!

Image
అమ్మమ్మ దిద్దవే అద్దమును చూసి రూకంత కుంకుమల  బొట్టు  కమ్మనైన మాట, కలువ చలువ చూపు నీవే మా  పెద్ద  దిక్కు అమ్మతోను చెప్పలేని అంతరంగపు టూహలకు చెవి  యొగ్గు  నెమ్మదివి ప్రేమంపు నిధివి,నీ ఉనికె మాకు కామాక్షి  రక్ష!

సుమ బంధం!

Image
శిశిరంలో పూర్తిగా ఆకు రాలిపోయి,మళ్ళీ తొందర గానే పచ్చటి ఆకులతో వచ్చేసి,గుత్తిగా విరిసిన ఈ  రాధా మనోహరాలిచ్చిన వసంతాగమన ఆనందం గూర్చి...... సుమ బంధం!     *** వచ్చినాయె ననల మెత్తలు తిరిగొచ్చినాయె ఆకురాలి బోసియైన కొమ్మపై మరల విరిసి! ముంగిటిమురిపెపు మొక్కతో తీయని బంధం పాదుచేసినీరుపోసి పెంచిన మమతల గంధం! చివురులేసి మొగ్గతొడిగి రాధామనోహరమైతే ఆ వేణుగానలోలుడె సన్నగ నవ్విన చందం! దళం హరిత సుందరం, సుమం కోమలారుణం గళం విప్పి పాడమనే విరిబాల సరాగం! ***

ఆడెనమ్మ శివుడు!

Image
        ఆడెనమ్మ శివుడు భవు డాడెను         వేడ్క శైశవ గణేశు కేల్పట్టి!         బుడిబుడి అడుగుల తనయుతో          జడముడి గంగల జగజ్జనకుడు!         మేల్మేలను చూపుల చందురుడు         నీ లీల విభో యను నందీశుడు!         నగరాజ నందిని చిత్త మాడి పాడ         హిమశైల సౌరులు పొంగి చూడ!         ఆనంద నిలయమిది కైలాసము         శివ పార్వతీ మంగళ సదనము!                              **

దివ్యనామి!

Image
దివ్యనామి!     *** రామభద్రు డితడు కోదండ విద్యానుపమ ధన్వి మౌళి సోమకౌముదీసమాహ్లాదక మాధ్యాహ్నమార్తాండ సందీప్తి భూమిసుతా మాధవీలతా సమాకర్షక మాకంద జాని కామితార్థదాయి,తన్నామ కవచిత భూమి జను లకున్ ! ***