ఆడెనమ్మ శివుడు!
ఆడెనమ్మ శివుడు భవు డాడెను
వేడ్క శైశవ గణేశు కేల్పట్టి!
బుడిబుడి అడుగుల తనయుతో
జడముడి గంగల జగజ్జనకుడు!
మేల్మేలను చూపుల చందురుడు
నీ లీల విభో యను నందీశుడు!
నగరాజ నందిని చిత్త మాడి పాడ
హిమశైల సౌరులు పొంగి చూడ!
ఆనంద నిలయమిది కైలాసము
శివ పార్వతీ మంగళ సదనము!
**
Comments
Post a Comment