Posts

Showing posts from June, 2023

విరి-సిరి!

Image
   నీలాకాశపు తోటను విరిసే,మురిపెపు మబ్బుల     విరులు/    పూలతోటను ఈ కోటను మెరిసే,గులాబి రాణుల       సిరులు!!                                  *****

దేశిక వరులు!!

Image
వారు రామపదార్చకులు,అంబికోపాసకులు, ఘనులు/ తిరుమలేశ క్రృతి కర్తలు, పద్మనాభార్పిత  చిత్తులు/ స్వర సోపానముల ముక్తిపురి చేరిన బయ కారులు/ బిరబిర రారె దర్శనమంద గాంధర్వ వేదా  క్రృతులన్!                       ****

రైతు!

Image
తన యింటి నేలంత చిత్తడై,కాలు మోప కష్టమైన వెనుదీయడు,వినవయ్య దేవ యని వినతి సేయు వానల కురిపింప రైతన్న, అన్నమిడు పెన్దాతన్న! కనులార పండి,తనివార భోంచేయ జను లెల్లరున్!!

తత్తడి!!

Image
       ఈ లోకముల వేచు తారకు డెటు సమయునో     యని/    చిలుక తత్తడి రౌతు పాపము పూల బాణము    లేయ/    మేలుకంటి సామి యకట!బూది చేసి,యనంగు         సేసె!/    మేలు చేయుటె గుణమైన తల్లి,రతి పతి తా    బ్రోవన్!!

కెంపులు కాచె!!

Image
  ఇంపు కూర్చ కనుగవ కద్భుతమని జనులు మీరి      పొగడ/       కెంపులె పూసె,కాచె నీ తీగకు ప్రక్రృతి వింతల           కంతున్నదే?!                                       ****   ( దొండ పళ్ళ పందిరి,అన్నీ తీగకు కాచిన                    కెంపుల లాగా!)                                   

రామ పదములు!!

Image
చక్ర శంఖ పద్మ స్వస్తికాద్యుత్తమ సాముద్రికానేక ముద్రాంకితా/ వక్ర పరాక్రమ కోదండవిద్యా మేరువా రామ విభుని పదము/ లక్రమ బుధ్ధుల నిట్టె సరిచేయు ధర్మ పథ నిశ్చిత గాముల/ వక్ర ఫలామోఘ వాగ్శప్త దీనుల బ్రోచు మోక్ష పద శుభమ్ములై!! ******

సీతాహ్రృది!!

Image
                             సీతాహ్రృది! వనిత మనసు స్తబ్ధమై హిమానీ శీతల శకల మయ్యె/ వనిత మది రసమింకి నిర్భావ శైలమై కరడు గట్టె/ వనిత చిత్త మాభీల కీలల మండి భస్మంపు రాశి యయ్యె/ వనిత నిశ్చేష్టయై,యింద్రియముల చేవ దక్కి, కుప్ప కూలె!                      (ii) అమ్ము మొన యెద గ్రుచ్చిన పగిది జానకి ప్రాణము తల్లడిల్లె/ సౌమిత్రిని విని,మిన్ను విరిగినట్లు, మన్ను లోనికి జారినట్లున్!! ***** (ఉత్తర రామాయణ సందర్భం )

ఏలనో?!

Image
       పూల రాణుల ఈ సోయగముల వని పొంగె/          నెల రాజుల ఆ చలువ కాంతుల దివి,భువి!/        కేల చేసిన వాడె, యేల దయమాలి,పూని/        రాలి,సోలి పోవగ జేయునో,తా నజ్ఞేయుడై !! ‌.                                   *****

తాడెత్తు!!

Image
         ఎంతటి ఎత్తని నిక్కుల తాటిచెట్టు/          ఇంతింత పచ్చటాకుల చింపిరి జుట్టు,/          అంతోటి ఆకసము నేస్తమని బెట్టు/          ఇంతటి వారేరి చూపండని ఓ బెట్టు!!                                  ****          (చివరిది ఇంగ్లీషు బెట్టు,'Bet'!)