సీతాహ్రృది!!


                             సీతాహ్రృది!

వనిత మనసు స్తబ్ధమై హిమానీ శీతల శకల మయ్యె/

వనిత మది రసమింకి నిర్భావ శైలమై కరడు
గట్టె/

వనిత చిత్త మాభీల కీలల మండి భస్మంపు రాశి యయ్యె/

వనిత నిశ్చేష్టయై,యింద్రియముల చేవ దక్కి,కుప్ప కూలె!
                     (ii)
అమ్ము మొన యెద గ్రుచ్చిన పగిది జానకి ప్రాణము తల్లడిల్లె/

సౌమిత్రిని విని,మిన్ను విరిగినట్లు, మన్ను లోనికి జారినట్లున్!!
*****

(ఉత్తర రామాయణ సందర్భం)

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!