Posts

Showing posts from March, 2023

వడగళ్ళు!!

Image
        ఆ దేవ లోకపు దివ్య కర్పూర కళిక లట్లు          నందనవన నందివర్ధనపు సుమములట్లు         నందుని యింట క్రిష్ణుకై ఆ వెన్న ముద్దలట్లు         వందలు వేలు వడగళ్ళు చూడ కనువిందులై!!

సావిత్రీసత్యవంతం!!

Image
ఊహల కందని సంకల్ప బలిమియు,పాతివ్రత్య  కలిమి/ అహో!కాలుతో పయనించి,తర్కించి,వాదించి,  మెప్పించి పతి/ నాహరించక నిల్పిన సతి సావిత్రి గాథ,భరత నారీ/ మహఛ్ఛక్తీ  సవిత్రృ  సుప్రభయై, సత్యాక్షయ చాంద్రీ నిభయై! (సావిత్రీ సత్యవంతుల గాథ)

కారపు బాణాలు!!

Image
1 పచ్చని, కమ్మని చురుకుల మెరపలు రోయ్, అచ్చపు తెలుగు వంటకు జవజీవము ల్రోయ్! ఖచ్చితముగ నోరు భగ్గమనునని తెల్సియు పిచ్చి యిష్టమీ యాంధ్రులకు,రుచుల విచిత్రమై! ************************************* 2 వంపులు తిరిగిన కారపు నిడువులు ఇంపుల గూర్చు తాలింపులకు ప్రాణములు పెంపగు మిరప కులమున మెరికలు సొంపగు పచ్చలు,పండినపుడు కెంపులౌ!                        (ii) కూరగాయల సీమ కాభరణములు, పేరొందిన బజ్జీ ఖ్యాతి కారణములున్!! ************************************** ("నాటు" పాటతో తెలుగు ఘాటు ప్రతిభను ప్రపంచ వ్యాప్తంగా చాటిన వేళ,ఆ ఘాటు ఘాటుకు కారణమైన వాటి  ప్రశంస! సరదాగా కాదు,వారి ప్రతిభకు ఇవే కారణం,నమ్మితే నమ్మండి!)

బద్రము రన్నో!

Image
జర బద్రము నున్నటి రాయన్నా! నీ రక్షణ  నీదే నన్నా/ సరదా యెవ్వరిదైన, జారి దొర్లు ప్రాణము నీదే నన్నా! !

సిరా కలము!!

Image
     బ లీయమిది,అన్ని దన్నుల కన్న,చెన్ను లొలికెడు       కలము/      పలుకు రాజనాల,తన గుండెలోన దాచిన పైడి         హలము/      ఉలకని, పలకని స్తబ్ధ జాతుల, కదిలించీ       న డిపించే/      అలుగుల,అలరుల,లాలింపుల,ఉద్గీతుల సిరి           గళము !

కమ్మని తల్లి!!

Image
పాల్కడలి పుట్టిన బంగరు రమణికి,చంద్ర  బాంధవికి/ పూల వితానము ల్వేల విరి సరముల అలంకరణలు!/ మేలు మేలు,కమ్మవిల్తుని తల్లి కమ్మని యుల్లపు తావికి/ పోలికేది,తావు హరి యురమైన పెన్దయ మహలక్ష్మికిన్!!

గిజిగాడు!

Image
        ఎగిరెగిరి గూళ్ళను కట్టి ,అలసి సొలసి         నింగిని చూచుచు,దిక్కుల కొలుచుచు ఆ పెద్ద!         ఎగిరెగిరి దిక్కుల జూచి,నింగి కొల్తునని         లోగిలి నుండి, సిరి కలల గనుచు, ఓ చిన్న!!

పాల గణపతి!!

Image
     పాల గణపతి, ఆ అగజ మురిపాల శిశువిది      తలలు పదింటికి పాఠము గఱపిన గడుసిది     బల్సరసముగ దంత లేఖిని వాడిన కరమిది      మ్రోల వేడిన,వర తీర్థమిడు కలశమ్మిదియున్!