కారపు బాణాలు!!
1
పచ్చని, కమ్మని చురుకుల మెరపలు రోయ్,
అచ్చపు తెలుగు వంటకు జవజీవము ల్రోయ్!
ఖచ్చితముగ నోరు భగ్గమనునని తెల్సియు
పిచ్చి యిష్టమీ యాంధ్రులకు,రుచుల విచిత్రమై!
*************************************
2
వంపులు తిరిగిన కారపు నిడువులు
ఇంపుల గూర్చు తాలింపులకు ప్రాణములు
పెంపగు మిరప కులమున మెరికలు
సొంపగు పచ్చలు,పండినపుడు కెంపులౌ!
(ii)
కూరగాయల సీమ కాభరణములు,
పేరొందిన బజ్జీ ఖ్యాతి కారణములున్!!
**************************************
("నాటు" పాటతో తెలుగు ఘాటు ప్రతిభను ప్రపంచ వ్యాప్తంగా చాటిన వేళ,ఆ ఘాటు ఘాటుకు కారణమైన వాటి ప్రశంస!
సరదాగా కాదు,వారి ప్రతిభకు ఇవే కారణం,నమ్మితే నమ్మండి!)
Comments
Post a Comment