Posts

Showing posts from April, 2020

విరి (యు) వైనము!

 గుప్పిటల దాచిన రత్న మాణిక్య ధగ ధగలను ఒప్పుగ భద్రహస్తముల విప్పి చెప్పు వైనమున ఇప్పూల ఠీవులేమొ,విరిసినవి కనుగవకు విందె మెప్పుగ క్రమసుందరమై విరియునవియున్!! విరిసిన విరి అందమ?! విరియుటయుఅందమ?! విరియు దశ నందుట అందమ?!విరియ జేసిన కరము అందమ,మనఃసుమ భావగంధములగొని  అరమరికలేమి లేక నిజముగ చెపుమ లీలాకృష్ణా

కురంగ స్వగతం!

Image
                         కురంగ స్వగతం!! కానల ఏనుగుల, కానుగుల నలుపుల చూచితి/ మిన్నుల కంటు సాలముల ఎత్తుల చూచితి/ భిన్నము చేయు ప్రాణముల కార్చిచ్చుల చూసితి/ వెన్నుల వణికించు బెబ్బులి నిప్పుకన్నుల చూసితి!                                (ii) ఇన్నని చెప్పగరాని వింతల చూసిన నాకే వింతయై/ వెన్నంటి వచ్చు తరంగ మాలిక ఇదేమో సారంగధరా!!

వందే వినాయకం!!

Image
ఓం నమః శివాయ సిధ్ధం నమః అని వేలు పట్టి అక్షరం దిద్దించే గురువు మాట విన్నాము, ఇక ఇప్పుడు దైవ స్మరణ!, ఇంకెవరు, మొట్టమొదటి దణ్ణం బొజ్జ గణపయ్యకేగా!!                               వందే   వినాయకం !                 వం దనములయ్య                 వేదావతారమ                 నాదతను ప్రీత                 కుధరజా సుతా!!   1                          ***                   దే వాది దేవేశ                  నీవే గతి మాకు                  ఏ విఘ్నము ల్లేక                  దీవెనల నిమ్మా!     2 ...

మేష్టారు గారు! (ప్రధానోపాధ్యాయులు)

Image
అబ్బబ్బబ్బ, ఏది వచ్చినా భరించ లేని పిల్లలూ,వారి పెద్దలూనూ!! పట్టుమని మూడు వారాలు కాలాడించకుందా ఇంటి పట్టున ఉండమంటే విల విల లాడుతున్నారు. బళ్ళు,, ఆఫీస్ లూ సజావుగా సాగినప్పుడేమన్నా, బుధ్ధి చట్రంలో ఉండేదా?! అబ్బే అదీ లేదు! "మేష్టారూ, కడుపులో నెప్పి" అని పిల్లలూ, "మా బామ్మ పోయింది,ఒక్కణ్ణే వారసుణ్ణి" అనో,మా "తాతయ్య,పెద్దాయన,ఒంట్లో సుస్తీగా వుందట" అనో పెద్దల అర్జీలు,వాటితో పాటు బిక్కమొహాలూ పెట్టీ నా ముందుండే వారు, క్యూలు గట్టి!! నేతి అన్నం, కూరా అమ్మ పెట్టినవి తినకుండా, వేరే గడ్డి మేస్తే రాదురా, మరి, కడుపు నెప్పీ!! నువ్వే నా ముందు నుంచొని ఇంతున్నావే,లేపాక్షి నంది లాగా,మీ తాతయ్య, పెద్దవాడు కాక చంటి వాడవుతాడ్రా?!! ఏం కథలూ కారణాలయ్యా, ఇవన్నీనూ?! ఇప్పుడేమో,సెలవులతో బాధపడుతున్నాట్ట, ఇంత పనుంటే ఇప్పించండి అని వేడికోలు!! సరే, అఘోరిద్దురు గాని లే, నాల్గు రోజులాగండి, ఆ కరోనా దాందారిన అది పోతుందీ, అప్పుడు ఇక వద్దన్నా, నడుము విరిగేంత పని ఉంటుందిలే!! ఆప్పుడొచ్చి, చూపిద్దురు గాని మీ కార్య కౌశలం! అందాకా, బుధ్ధిగా ఇంట్లోనే ఉండండి, ఇల్లు దాటద్దు, ఖబడ్దార్!!...