వందే వినాయకం!!
ఓం నమః శివాయ సిధ్ధం నమః అని వేలు పట్టి అక్షరం దిద్దించే గురువు మాట విన్నాము, ఇక ఇప్పుడు దైవ స్మరణ!, ఇంకెవరు, మొట్టమొదటి దణ్ణం బొజ్జ గణపయ్యకేగా!!
వందే వినాయకం!
వం దనములయ్య
వేదావతారమ
నాదతను ప్రీత
కుధరజా సుతా!! 1
***
దే వాది దేవేశ
నీవే గతి మాకు
ఏ విఘ్నము ల్లేక
దీవెనల నిమ్మా! 2
***
వి నాయక,నీవె
ప్రణవ రూపివి
అనాది కవివి
సేనానీ స్తుతివి!! 3
***
నా గాధ్బుత ముఖ
వాగీశాది నుత
ఆగమ పూజిత
అగణిత గుణా!! 4
***
య మ నియమాల
ఏమి కట్టడి?!నే
విమలాత్మునైన
బ్రోచు హ్రృస్సులభా!! 5
***
కం జాత సంస్తుత
శుక తాతార్ధిత
జయకావ్య జ్ఞేయ
జయము నీయవే!! 6
***. ***. ***. ***. ***. ***.
Comments
Post a Comment