Posts

Showing posts from November, 2024

సమభావం!

Image
ఎంత పాల వెన్నెల కాన చీకట్లలోన దూరి జారిపోయెనో ఎంత మురిపాల వెన్నెల ఆ గోగుపూల చేరి రహి పెంచెనో ఎంత వెండిపూల సౌరుల తెలుపెరుగని ఆ  చెట్ల నింపెనో ఎంత పైడి చేల వరికంకుల సైయ్యాటలకు తళ్కు లద్దెనో ఇంత లే దుల్లమున తన పర తరు గిరి కానన భేదము చింతల తొలగించు శాంతకాంతుల ధనికి కలువరేనికిన్!!

మిశ్రరాగాలు!

Image
    అల్లనల్లన వీచేటి చల్లగాలి తరగల హేల      న్రృత్యములు/       మెల్లమెల్లని సన్నని గళముల సాగేటి గాలి      సంభాషణలు/     తెల్లతెల్లవి కావు ఎర్ర ఎర్రలుకావు కోటి కొకటౌ     రాగాలు/    కొల్లబోవును కాదె మాటలు,పూలబాలల సౌరుల       వర్ణనలన్!