సమభావం!
ఎంత పాల వెన్నెల కాన చీకట్లలోన దూరి జారిపోయెనో
ఎంత మురిపాల వెన్నెల ఆ గోగుపూల చేరి రహి పెంచెనో
ఎంత వెండిపూల సౌరుల తెలుపెరుగని ఆ చెట్ల నింపెనో
ఎంత పైడి చేల వరికంకుల సైయ్యాటలకు తళ్కు లద్దెనో
ఇంత లే దుల్లమున తన పర తరు గిరి కానన భేదము
చింతల తొలగించు శాంతకాంతుల ధనికి కలువరేనికిన్!!
Comments
Post a Comment